ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, గిరిజన కుంభమేళా గా పేరు గాంచిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే దాదాపు కోటిన్నర భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ద్వారా అద్భుతమైన విస్తృత ఏర్పాట్లు హర్షణీయమని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు.
తాను గిరిజన సాంప్రదాయ జాతరలో శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను మొక్కులు సమర్పించు కోవడానికి శుక్రవారం మేడారం సందర్శించినప్పుడు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా యంత్రాంగం చేసిన విస్తృతమైన ఏర్పాట్లను అభినందిస్తు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ లేఖలో ప్రశంసించారు.
భక్తులను సులభతరం చేయడానికి చేసిన విస్తృతమైన ఏర్పాట్ల కోసం మొత్తం జిల్లా యంత్రాంగం చేసిన ప్రశంసనీయమైన పనిని రికార్డులో ఉంచాలనుకుంటున్నానని, నా సందర్శన సమయంలో విస్తరించిన మర్యాదలకు వ్యక్తిగతంగా మీ బృందంలోని ప్రతి సభ్యునికి ధన్యవాదాలు. హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అంటూ గవర్నర్ ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణాన్ కు పంపారు.