38.2 C
Hyderabad
May 2, 2024 21: 35 PM
Slider ప్రత్యేకం

కిసాన్ సర్కార్ కాదు.. కసాయి సర్కార్

#congress

కేసీఆర్ వచ్చాకే భూముల దందా: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

మా ప్రభుత్వం కిసాన్ సర్కార్ అని కేసీఆర్ ప్రతిసారి చెప్తున్నారని.. కానీ ఇది కసాయి సర్కార్ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కామారెడ్డి నియోజకవర్గం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనడానికి కామారెడ్డి వచ్చారు. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తో కిసాన్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతో కలిసి మాస్టర్ ప్లాన్ రద్దు విషయమై షబ్బీర్ అలీ చర్చించారు.

అనంతరం కలెక్టరేట్ బయట షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. 55 రోజులుగా రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్ లకు దున్నపోతు మీద వాన పడినట్టు ఉందన్నారు. 55 రోజులుగా ఆందోళనలు చేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులపై నమ్మకం లేకుంటే రైతులను పిలిచి మాస్టర్ ప్లాన్ ఉద్దేశాన్ని చెప్పాల్సిందన్నారు.

మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ లకు ఉందన్నారు. నాయకులను అధికారులను రైతులతో కలవనివ్వకపోతే డేమక్రసి ఎక్కడ ఉందన్నారు. రైతులు రాత్రి వరకు ఆందోళన చేస్తే కలెక్టర్ వచ్చి వినతిపత్రం తీసుకుని దానిని సీఎస్, సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు పంలించాల్సిందన్నారు.

ఆప్ కె పురా కిసాన్ సర్కార్ అని చెప్పడం తప్పని, తాగుబోతుల సర్కార్ గా మార్చారని దుయ్యబట్టారు. రైతుల ఆందోళనలో రాజకీయ నాయకులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీలో రైతులు లేరా అని ప్రశ్నించారు. రైతుల కోసం నాయకులు ఖచ్చితంగా వస్తారని, అందులో తప్పేముందన్నారు. కలెక్టర్ కు భయంగా ఉంటే కేటీఆర్ ను పిలిపించించుకుని రైతులతో మాట్లాడించాలని సూచించారు.

ఇండస్ట్రియల్ భూములలో ఎవరి పేర్లు ఉన్నాయో వారినే పిలిచి మాట్లాడాలన్నారు. ఈ విషయంపై వెంటనే సంబంధిత మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

2014 లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భూముల దందా పెరిగిపోయిందన్నారు. భూ దందాతో మంత్రుల ఇళ్లలో డబ్బుల కట్టలు పెంచుకున్నారని, రైడ్స్ చేస్తే ఒక్కొక్క మంత్రి ఇంట్లో డిసిఎం వ్యానుల కొద్దీ డబ్బులు లభిస్తాయని చెప్పారు. మాస్టర్ ప్లాన్ పై వెంటనే కేటీఆర్ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేసారు.

Related posts

హామీలను విస్మరిస్తే ప్రజా పోరాటాలు

Bhavani

అతి చిన్న వయ‌స్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్య‌క్తి బాబూ జ‌గ‌జ్జీవ‌న్ రామ్

Satyam NEWS

బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయం

Bhavani

Leave a Comment