27.3 C
Hyderabad
May 10, 2024 08: 28 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి వచ్చి కేసీఆర్ ఇరుక్కుపోయాడు

#akkalkot

సీఎం కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డి వచ్చి ఇరుక్కుపోయాడని మహారాష్ట్ర అకల్ కోట ఎమ్మెల్యే సచిన్ కళ్యాణ్ శెట్టి అన్నారు. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా సచిన్ కళ్యాణ్ శెట్టి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారన్నారు. ప్రజలు, కార్యకర్తలను కలిసి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య విడదీయరాని బంధం ఉందని ఆరోపించారు.

9 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనేక నిధులు ఇచ్చిందని, ఆయుష్మాన్ భారత్, ఉచిత విద్య, ధాన్యం కొనుగోలు, రహదారుల విస్తరణ, రైతులకు నగదు బదిలీ, రామగుండం విద్యుత్ కోసం లక్షల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, కేసీఆర్ కుటుంబం నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ అమలుకు నోచుకోలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి శూన్యమని, దోమకొండకు డిగ్రీ కళాశాల మంజూరు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇక్కడ కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి భూములు కబ్జా చేస్తారని తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లను ప్రజలు గుర్తించడం లేదని చెప్పారు. తెలంగాణాలో బీజేపీ పటిష్టంగా ఉందని, కేసీఆర్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. కాంగ్రెస్ లో గెలిచినా కేసీఆర్ కు అమ్ముడుపోతారని ఆరోపించారు. బెంగాల్ లో అక్కడి సీఎంను ఓడించామని, ఇక్కడ అదే జరగబోతోందని జ్యోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ కల నెరవేరలేదని, కేవలం కేసీఆర్ కుటుంబమే బంగారమైందన్నారు. కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డి రావడం వెనక పక్క ప్లాన్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ కు వ్యతిరేకత ఉందని, కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారని, ఇక్కడి పరిస్థితులు తెలిసి వెనుదిరిగితే కేసీఆర్ పరువు పోతుందన్నారు.

తెలంగాణ నుంచి డబ్బు తెచ్చి మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారని, ఈ డబ్బు తరలింపుపై దర్యాప్తు సంస్థల నిఘా ఉందన్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో బీజేపీ బలంగా ఉందని, అక్కడ కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవరన్నారు. లిక్కర్ స్కామ్ పై ఈడి దర్యాప్తు చేస్తోందని, విచారణలో దోషి అని తేలితే కవిత అయినా ఎవ్వరైనా అరెస్ట్ తప్పదన్నారు. కామారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయశాంతి వస్తున్నారన్న ప్రచారంపై ప్రశ్నించగా ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనేది చెప్పే అధికారం పార్టీకి తప్ప ఎవరికి లేదని, అభ్యర్థుల వివరాలు పార్టీనే ప్రకటిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

నయా ట్రెండ్ :మార్కెట్లోకి డిజిటల్ గర్ల్ ఫ్రెండ్స్

Satyam NEWS

బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి

Bhavani

Leave a Comment