Slider మహబూబ్ నగర్

కేంద్ర పథకాలను తన పేరుతో వాడుకుంటున్న కేసీఆర్

#DKAruna

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత గురువారం తొలిసారిగా ఆమె జిల్లాలో పర్యటించారు.

తొలుత ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆంజనేయస్వామి, అలంపూర్‌ ఆలయాలు, జమ్మిచేడులోని జమ్ములమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

జోగులాంబ ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌, అర్చకులు ఘన స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, జోగులాంబకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ స్వామి, అమ్మవారి కృపవల్లే జాతీయ స్థాయి పదవి దక్కిందన్నారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రజలు భాజపా వైపే ఉన్నారని, దుబ్బాక ఎన్నికల్లో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. జాతీయస్థాయి పదవి కట్టబెట్టిన మోదీ, అమిషా, నడ్డాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వమే తుంగభద్ర పుష్కర పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియకుండా సీఎం కేసీఆర్‌ దాస్తున్నారని ఆరోపించారు.

జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, కిషన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యపు రెడ్డి, నాయకులు  గడ్డం కృష్ణా రెడ్డి, నందిన్నె ప్రకాశ్ రావు,మిర్జాపురం రామచంద్ర రెడ్డి,  శ్రీవర్ధన్‌రెడ్డి, అప్సర్‌బాషా, రవిహేగ్‌బోటే, సంజీవ్‌భరద్వాజ్‌, అశోక్‌, శ్రీనివాస్‌రెడ్డి,   రామాంజనేయులు,బండల వెంకట్రాములు, పాండు, వెంకటేశ్వరరెడ్డి,కృష్ణవేణి, రజక జయశ్రీ, తెలుగు అనిత నర్సింహులు, రమాదేవి , పూజారి శ్రీధర్, పాల్గొన్నారు.

Related posts

ఉద్యోగమేమో ఫుల్ టైం జీతం మాత్రం పార్ట్ టైం

Satyam NEWS

ప్రధాన డిమాండ్ వదిలేశారుగా చర్చలు జరపండి

Satyam NEWS

కరోనా విజృంభిస్తుంటే వైన్స్ సమయం పెంచుతారా?

Satyam NEWS

Leave a Comment