28.2 C
Hyderabad
May 9, 2024 00: 49 AM
Slider వరంగల్

జాతిపిత కు మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులు

#MinisterSatyavathiRathode

అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 151వ జయంతి సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులు అర్పించారు. 

మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలు ముగిసి 151వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు.

పల్లే సీమలే దేశానికి పట్టు కొమ్మలన్న గాంధీజీ బాటలోనే గౌరవ సిఎం కేసిఆర్ పయనిస్తున్నారని, గ్రామాల స్వయం సమృద్ధి, పల్లె ప్రగతి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసిఆర్ అన్నారు.

భారతమాత తల రాతను మార్చి, తరతరాల యమ యాతను తీర్చిన విధాత గాంధీజి అయితే తెలంగాణ తల్లి తల రాతను మార్చి…ఆత్మగౌరవ ప్రతీకను ఎగురవేసిన ఉద్యమ నేత సిఎం కేసిఆర్ అన్నారు.

జై జవాన్, జై కిసాన్ అని నినదించి ఈ దేశానికి సైనికుడు, రైతు ప్రాముఖ్యతని తెలియజేసిన దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులు అర్పించారు.

సైనిక కుటుంబాలకు ఈ దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా మద్దతుని పలికి, రైతును రాజు చేయాలనే సంకల్పంతో లాల్ బహదూర్ శాస్త్రి మాటలను ఆచరణలో అమలు చేస్తున్న గొప్ప నాయకులు సిఎం కేసిఆర్ అన్నారు.

Related posts

గేమ్ స్టార్ట్: సీఎం జగన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

Satyam NEWS

వనపర్తిలో జిల్లా కోర్టు కాంప్లెక్స్ కోసం స్థలం పరిశీలన

Satyam NEWS

ఏపిలో పెయిడ్ ఆర్టిస్టుల గందరగోళం

Satyam NEWS

Leave a Comment