39.2 C
Hyderabad
April 28, 2024 11: 20 AM
Slider నిజామాబాద్

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన

#BichkundaHealth

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మేజర్ గ్రామ పంచాయతీ బిచ్కుంద లో RBSK డాక్టర్ విక్రమ్,  డివిజినల్ ఆరోగ్య బోధకుడు దస్థిరాం  ఆధ్వర్యములో  ఆరోగ్య కార్యకర్తలు  ఆశలు ఇంటింటికి తిరిగి  డొమెస్టిక్ సర్వే చేశారు.

ఇళ్లలో ఉన్న నీటి తొట్టిలను , కొబ్బరి చిప్పలను,పాత టైర్ల్ లను, వాడి పడేసినా పాత డబ్బలను సీసాలను, పాత కూలర్  లను మొదలగు వాటిని పరిశీలించి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని పలువురికి సూచించారు.

గాంధీ జయంతి పురస్కరించుకొని ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదం తో పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలని చెత్త చెదరాలను సేకరించి డంపింగ్ యార్డులో వేయాలని  పారిశుద్ధ్య పనులను చేపట్టి దోమలు వృద్దికాకుండా చూడాలని ఫ్రైడే ఇస్ డ్రై డే ను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని  గ్రామములో గుంతలలో నీరు నిల్వకుండా చుసుకోవాలనే అంశాలను గ్రామములోని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కోవిడ్ 19 నిబంధనలకు  అనుగుణంగా  ఆరోగ్య కార్యకర్తలు ఫ్లారెన్స్, గంగామణి, బాలామణి,ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళి

Satyam NEWS

317 జీవో సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన

Satyam NEWS

సిలువగిరి కొండపై ఒక వ్యక్తి దారుణ హత్య

Bhavani

Leave a Comment