34.7 C
Hyderabad
May 5, 2024 01: 06 AM
Slider నిజామాబాద్

సీఎం చేతులక్ మీదుగా ఎస్పీ కార్యాలయం ప్రారంభిస్తాం

#Kamareddy Police

నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు.

పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అందరి సహకారంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. కేసీఆర్ పరిపాలన దక్షత, దూరదృష్టితో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకి సాగుతోందని ఆయన అన్నారు.

సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సారిగా పోలీసు ఉన్నతాధికారులతో కేసిఆర్ సమావేశం నిర్వహించి శాంతియుత వాతావరణం కోసం పోలీసు శాఖకు 575 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కోసం నిధులు ఇస్తున్నారని అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత 13 జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణాలతో పాటు రామగుండం, సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్  నిర్మాణలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిలో రెండు కమిషనరేట్లు, కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయని వీటిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా  ప్రారంభించడానికి పనుల పర్యవేక్షణ కోసం ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు.

త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, జిల్లా ఎస్పీ శ్వేత లు పాల్గొన్నారు.

Related posts

దివ్యాంగుల కాలనీ లో సమస్యలు పరిష్కరిస్తాం

Bhavani

మీ అందరు పోతరు…కమిషనర్‌‌ని ఫోన్‌లోనే కడిగేసిన టీపీసీసీ చీఫ్

Satyam NEWS

కొండగట్టుకు రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు

Bhavani

Leave a Comment