25.2 C
Hyderabad
May 8, 2024 10: 07 AM
Slider విజయనగరం

‘స్పందన కు 236 వినతులు..వాటిని వేగంగా పరిష్కరించాలి’

#Spandana Programme

విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కు 236 వినతులు అందాయి.   ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల,  ఆరోగ్య శ్రీ , ఆదరణ,  రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. 

జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ ,  సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్,  జే. వెంకట రావు, సహాయ కలెక్టర్ సింహాచలం,  జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, వినతులను అందుకున్నారు.  ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,  ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాస రావు తమ నియోజక వర్గ సమస్యల పై కలెక్టర్ కు వినతులను అందించారు.

స్పందన వినతులు పరిష్కరించాలి

అనంతరం  20 మందికి   విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యం లో వినికిడి యంత్రాలను అందజేసారు. స్పందనలో అందిన  వినతులను  వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం పౌర సరఫరాల వాహనాల లబ్ది దారులు,  ఇళ్ళ పట్టాలు, జగనన్న తోడు, కన్వర్జెన్స్ పనులు, నాడు- నేడు , బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, ధాన్యం సేకరణ, నీతి అయోగ్ మత్స్యకార భరోసా తదితర పధకాల పురోగతిపై సమీక్షించారు.

పౌర సరఫరాల  ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేయుటకు అవసరమగు వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలను వెంటనే పంపించాలని కలెక్టర్ డా.హరిజవహర్ ఆదేశించారు.

ఎస్.సి. ఎస్.టి, బి.సి, మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ది దారులను ఎంపిక చేసి  జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదానికి పంపాలని, వచ్చే ఏడాది అంటే జనవరి 1 నుండి పధకం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ నెల 25 న పంపిణీ చేసే    ఇళ్ళ స్థలాల పట్టాలను ప్రింటింగ్ చేయించి ఇస్తున్నామని, అయతే టిడ్కో కు చెందిన పట్టాలు ఇంకా ప్రింటింగ్ పూర్తీ కాలేదని,  వెంటనే ప్రింటింగ్ పూర్తి అయ్యేలా చూడాలని గృహ నిర్మాణ అధికారులకు ఆదేశించారు.

ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న  కన్వర్జెన్స్  పనులను సత్వరమే ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.   రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలు,  అంగన్వాడి కేంద్రాలు , సచివాలయాల  నిర్మాణాలకు ప్రారంభం కాని  పనులు వెంటనే ప్రారంభం చెయ్యాలన్నారు.

ఈ పనులకు అవసరమగు భూమి వెంటనే హ్యాండ్ ఓవర్ కావాలన్నారు.  వై.ఎస్.ఆర్ బీమా,  జగనన్న తోడు  పధకాలలో పురోగతి కనపడాలన్నారు.  పెండింగ్ ఉన్న ఇ – సేవలు  క్లియర్ అయ్యేలా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు కు సూచించారు. నీతీ అయోగ్ క్రింద చేపడుతున్న పధకాలను సమీక్షిస్తూ మళ్ళీ మొదటి స్థానం లో ఉండాలని, ఆయా శాఖలు ప్రగతి సాధన లో ముందుకు రావాలని అన్నారు.

మండలాల్లో జరుగుతున్న పలు ప్రభుత్వ నిర్మాణాలు,  ఇళ్ళ స్థలాలు, లబ్ది దారుల ఎంపిక తదితర అన్ని కార్యక్రమాలను మండల  ప్రత్యేకాధికారులు తనిఖీ చేయాలన్నారు.   ముఖ్యంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల పై ప్రత్యేక  దృష్టి సారించాలని సూచించారు. 

జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వాటిని ప్రజలకు చేరువయ్యేలా సంబంధిత అధికారులు  చూడాలని  అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాలు, మనం- మన పరిశుభ్రత, కోవిడ్ పై 50 రోజుల ప్రణాళిక , ప్రత్యేక సమ్మరీ రివిజన్ క్రింద ఓటర్ల నమోదు తదితర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని, వాటి పై ఆయా  శాఖల అధికారులు  దృష్టి పెట్టి  విజయవంతం చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో అన్ని శాఖల  జిల్లా అధికారులు  హాజరయ్యారు.

Related posts

సమరత సేవా ఫౌండేషన్ హిందూ ధర్మ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

Bhavani

కావలి సువర్ణమ్మ కు ఘనంగా నివాళులు అర్పిద్దాం

Satyam NEWS

అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment