37.2 C
Hyderabad
May 2, 2024 14: 04 PM
Slider నెల్లూరు

దివ్యాంగుల కాలనీ లో సమస్యలు పరిష్కరిస్తాం

#Rural Constituency

దివ్యాంగుల కాలనీలో సమస్యలను పరిష్కరిస్తామని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. 23వ డివిజన్లోని దివ్యాంగుల కాలనీలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో కొందరు దివ్యాంగులు కొన్ని సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, పార్కు ఏర్పాటుతో పాటు విగ్రహాలు కావాలని అడిగారన్నారు. వాటిని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.

అలాగే కొంతమంది పెన్షన్లు రాలేదని తన దృష్టికి తెచ్చారని,విచారిస్తే విద్యుత్ బిల్లుల సాంకేతిక సమస్యల వల్ల అవి ఆగినట్లు తెలిసిందన్నారు. వాటిని జూన్ నుంచి పునరుద్ధరిస్తామని తెలిపారు. కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాత పాటి పుల్లారెడ్డి, యనమల మల్లికార్జున్రెడ్డి, మస్తాన్ రెడ్డి, శివయ్య, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, పెంచల్ రెడ్డి, జిలాని, బుఖారి, రమేష్ లు పాల్గొన్నారు.

వీరితోపాటు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్ మూలే విజయ భాస్కర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, హరిబాబు యాదవ్, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

Satyam NEWS

కేటీఆర్… ముందు అర్ధరాత్రి వరకూ మందుతాగించే పని మానుకో

Satyam NEWS

మతి స్థిమితం లేని ఈ మహిళను గుర్తుపట్టగలరా?

Satyam NEWS

Leave a Comment