40.2 C
Hyderabad
April 29, 2024 18: 09 PM
Slider నిజామాబాద్

మహిళా ఉద్యోగికి సర్పంచ్ భర్త బెదిరింపు

#Soundarya

ఉపాధి హామీ పనికి రాకున్న కూలి డబ్బులు వచ్చేలా చేయాలని ఓ జూనియర్ మహిళ పంచాయతీ కార్యదర్శిపై గ్రామ సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త, మాజీ కారొబార్ బెదిరింపులకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తనకు రక్షణ కావాలని, బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో గత సంవత్సర కాలంగా సౌందర్య అనే మహిళ ఉద్యోగి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చూస్తున్నాడు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేస్తున్నాడని ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్తులతో వ్యతిరేకత తెచ్చారు.

దాంతో గత వారం రోజులుగా ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి చూస్తున్నారు. ఈ నెల 25 వ తేదీన మద్యం సేవించి గ్రామ సర్పంచ్ భర్త కిషన్ గౌడ్, ఎంపీటీసీ భర్త దత్తాద్రి, లింగపూర్ మాజీ కారొబార్ జగదీశ్వర్ లు గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామస్తులు పని చేసినా చేయకున్నా కూలి డబ్బులు రెండు వందలు వచ్చేలా చూడాలని ఆమెను కోరారు. దానికి ఆమె ససేమిరా అనడంతో బెదిరించారు. పని ఎలా చేస్తావో చూస్తామని, ఒకవేళ వేరే గ్రామానికి బదిలిపై వెళ్లినా అక్కడ కూడా బెదిరింపులకు గురి చేస్తామని గొడవకు దిగారు.

అంతే కాకుండా ఎంపీటీసీ భర్త ఎస్సి కావడంతో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెడతానని అసభ్యకరంగా మాట్లాడాడని సౌందర్య తెలిపింది. ఈ ఘటనపై రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సౌందర్య పేర్కొంది. సర్పంచ్ భర్త, ఎంపీటీసీ భర్త, మాజీ కారోబార్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ లేదని, న్యాయం చేయాలని కోరుతోంది.

ఆరోపణల్లో వాస్తవం లేదు

అయితే పంచాయతీ కార్యదర్శి చేసిన ఆరోపణలు అవాస్తవమని సర్పంచ్ భర్త కిషన్ గౌడ్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు 30 రూపాయలు వస్తున్నాయని అదే విషయమై ఆమెకు 200 వచ్చేలా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు. అంతే కాని ఆమెను బెదిరించలేదని చెప్పారు. ఆమెకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకనే ఈ ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. తాము ఆమెను చంపేస్తామని బెదిరించినట్టయితే తమపై మర్డర్ కేసు పెట్టినా జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని తెలిపారు.

కేసును విచారిస్తున్నాం

ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా మద్యం సేవించి తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసారని, విచారణ చేస్తున్నామని ఇంచార్జ్ హౌస్ ఆఫీసర్ గణేశ్వర్ తెలిపారు.

Related posts

డెడ్ బాడీ కిడ్నాప్ చేసిన మృతుడి బంధువులు

Satyam NEWS

తెలంగాణ తల్లి ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీనే

Satyam NEWS

ఫార్మసీ ఉద్యోగాల కోసం వికారాబాద్ లో జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment