23.2 C
Hyderabad
May 7, 2024 19: 10 PM
Slider కరీంనగర్

చెత్త చెత్త:కలెక్టర్ గారుమున్సిపల్ అధికారులపై చర్యలేవి ?

collector muncipality

సమ్మక్క జాతర ముందు వేములవాడ కు విచ్చేస్తున్న లక్షలాది భక్తులు ఆలయ పరిసరాలతో పాటు పట్టణం లో కుడా తిరుగాడుతుండటం తో ఎక్కడి కక్కడే చెత్త పేరుకుని ఉండటం తో గల్లీలు వాసనా కొడుతున్నాయి.ముఖ్యం గా పోచమ్మ నుండి భీమేశ్వర స్వామి గుడి వైపు వెళ్లే దారిలో భరించలేని దుర్వాసన వస్తుంది.ఇక్కడ కోళ్ల వ్యర్థాలు ఈ దుర్వాసనకు కారణం కాగా కరోనా లాంటి వ్యాధులు ప్రబలుతున్న ఈ సమయం లో ఇక్కడ అధికారులు ప్రత్యేక శ్రద్ద చేపట్టాల్సిఉంది.

పట్టణం లో రెండు బై పాస్ రోడ్లలో జంతువుల శవాల కంపు కొడుతున్నాయి.వీటిపై మున్సిపల్ అదికారులు చర్యలు చేపట్టి పారిశుధ్య నివారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పారిశుధ్య నిర్వహణ సరిగా లేదాని చెబుతూనే ఆలయ ఈ.ఓ పై చర్యలకు ఉపక్రమించగా మున్సిపల్ అధికారులను అయన ఎందుకు ఉపేక్షించాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.రోడ్డు పైన ఉన్న చెత్త బాధ్యత ముమ్మాటికీ మున్సిపల్ అధికారుల దే అంటున్నారు

ప్రజలు.పైగా దేవాలయం నుండి మున్సిపాలిటీకి లక్షలాది రూపాయల గ్రాంట్ పారిశుద్యం,మెయింటెనెన్స్,పన్నుల రూపం లో చెల్లిస్తున్న ఆలయం వేరు మున్సిపల్ వేరు అనే ఆలోచన ఎందుకు వస్తుందని అని ఇక్కడ పని చేసిన మాజీ సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు.చెత్త పేరుకు పోయి ప్రజారోగ్యం దెబ్బ తింటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం లో ఆలయం,మున్సిపల్ బాగస్వామ్యులైనందున విభేదాలు మరిచి ప్రజలకు సేవ చేయాలనీ వారు కోరుతున్నారు.

కాగా పారిశుధ్యాన్ని సంబంధించి ఇటు మున్సిపల్ అధికారులకు అటు దేవాలయ ఉద్యోగులకు కలెక్టర్ మెమోలు జారీ చేసి రెండు డిపార్ట్మెంట్ లను సమానంగా బాద్యులను చేయాల్సి ఉందని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణం లో పారిశుధ్య నివారణకు,పందుల బెడదను తగ్గించటానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Related posts

హైదరాబాద్ కు వస్తున్న ఫార్ములా వన్ రేసింగ్

Bhavani

తప్పుడు కేసులతో సతమతమవుతున్న జర్నలిస్టులు

Satyam NEWS

శబరిమల దర్శించే అయ్యప్ప భక్తులకు వసతి సౌకర్యాలు

Bhavani

Leave a Comment