28.7 C
Hyderabad
April 27, 2024 04: 24 AM
Slider కృష్ణ

శబరిమల దర్శించే అయ్యప్ప భక్తులకు వసతి సౌకర్యాలు

#Ayyappadevotees

వివిధ రాష్ట్రాల నుండి వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్రంలోని దేవస్థానాల బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో తాగునీరు,అన్నదానం,విరి వంటి సౌకర్యాలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.విపి జోయ్ తెలియజేశారు. ఈమేరకు కేరళ సిఎస్ ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి లేఖ రాశారు. ఈసౌకర్యాలను రాష్ట్రం నుండి శబరిమలై అయ్యప్ప దర్శనానికి వెళ్ళే అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకునేలా చూడాలని విజ్ణప్తి చేశారు.గత రెండేళ్ళు కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా అనేక కోవిడ్ నిబంధనలతో అయ్యప్ప స్వామి దర్శనాలను పూర్తిగా నిర్వహించలేక పోయామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కోవిడ్ తగ్గినందున కోవిడ్ నిబంధనలన్నీ పూర్తిగా ఎత్తివేసిన దృష్ట్యా ఈఏడాది శబరిమలైను సందర్శించే అయ్యప్ప భక్తులకు పెద్దఎత్తున దర్శనాలు కల్పించేందుకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు కేరళ సిఎస్ విపి జోయ్ ఎపి సిఎస్ డా.జవహర్ రెడ్డికి వ్రాసిన లేఖలో పేర్కొన్నారు.

శబరిమైలై అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ రాష్ట్రంలోని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ జిల్లాల్లో అనగా కొట్టరకక్కర దేవస్థానం,పులనూర్ గ్రూప్,కరుంగపల్లి గ్రూప్,అంబలపూజా గ్రూప్,హరిప్పాడ్ గ్రూప్,అరన్ మూల గ్రూప్,కొట్టాయం గ్రూప్,ఎట్టుమన్నూర్ గ్రూప్,వైక్కోమ్ గ్రూప్,త్రిక్కరోరియూర్ గ్రూప్, పరవూర్ గ్రూప్,ముండక్కయాం గ్రూప్,ఊలూర్ గ్రూప్, నేయతిన్కర గ్రూప్ ల ఆధ్వర్యంలో మొత్తం 52 మిడ్ వే షెల్టర్లను ఏర్పాటు చేసి వసతులు కల్పించినట్టు కేరళ సిఎస్ విపి జోయ్ తెలియజేశారు.

అలాగే కొచ్చిన్ దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ జిల్లాల్లో 7 మిడ్ వే షెల్టర్లను, మలబార్ దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ జిల్లాల్లో 12 మిడ్ వే షెల్టర్లలోను ఈవసతి సౌకర్యాలను కల్పించినట్టు కేరళ సిఎస్ తెలిపారు.ఈమిడ్ వే షెల్టర్లలో కల్పిస్తున్న సౌకర్యాలను అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకునేలా వివిధ ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం గావించి అయ్యప్ప భక్తులందరికీ పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేరళ సిఎస్ డా.విపి జోయ్ ఎపి సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డికి విజ్ణప్తి చేశారు.

Related posts

రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ యష్

Satyam NEWS

ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్

Satyam NEWS

హైదరాబాద్ లోనూ ప్రచారం

Murali Krishna

Leave a Comment