19.7 C
Hyderabad
January 14, 2025 04: 11 AM
Slider ఆదిలాబాద్

అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలను తల్లి లాగా చూసుకోవాలి

collector nirmal 16

అంగన్వాడి కేంద్రాలలో చదువుతున్న పిల్లలకు తల్లి లాగా చూడడంతో పాటు పిల్లలు, గర్భిణీలకు  పౌష్టిక ఆహారం అందించి వారి ఎదుగుదలకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ సి డి పి వో లు,  సూపర్వైజర్ లను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సి డి పి వో లు, సూపర్వైజర్ లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అంగన్వాడి కేంద్రాల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 940 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వీటిలో చదువుతున్న  పిల్లలకు పౌష్టికాహారం అందించి పిల్లల ఆరోగ్యవంతంగా పెరిగేలా మంచి పౌష్టికాహారం అందించాలన్నారు.

అంగన్ వాడి సెంటర్లో ఉన్న ఎక్విప్మెంట్, చార్టులను , అభ్యాస సహాయాలను ఆటవస్తువులను, వినియోగంలోకి తీసుకురావాలన్నారు. చార్ట్ లను గోడలపై అమర్చాలని ఆదేశించారు. ప్రతి అంగన్వాడి టీచర్ వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు.

ప్రతి సూపర్వైజర్ కనీసం రోజుకు రెండు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను పక్కనున్న సెంటర్ లోని టీచర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలి అన్నారు. అంగన్వాడీ టీచర్లు తమ లొకేషన్ షేర్ చేయాలని కలిపారు. వారం రోజులు గైర్హాజరు ఐన విద్యార్థులను గుర్తించి వారి ఇంటికి వెళ్లి వారు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు.

పిల్లల పెరుగుదల లోపించకుండా, ఎత్తు, బరువు  తగ్గకుండా మంచి పౌష్టిక ఆహారం అందించాలన్నారు. అంగన్వాడి సూపర్వైజర్ రేపటి నుండి వారం రోజులు వారి పరిధిలో ఉన్న కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో ఏ పరికరాలు ఉన్నాయో గుర్తించి వాటికి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజగోపాల్, సి డి పి వో లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ కు సవాల్: రైతుల దగా పై చర్చకు సిద్ధమా?

Sub Editor 2

ములుగు జిల్లాకు విశేష సేవలు అందించిన క్రిష్ణ ఆదిత్య

Satyam NEWS

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని రథోత్సవం

Satyam NEWS

Leave a Comment