29.7 C
Hyderabad
May 1, 2024 07: 28 AM
Slider కరీంనగర్

మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం సమర్పించిన వీఆర్ఏలు

#ministergangulakamalakar

పేస్కేలు అమలు, అర్హులైన వారికి పదోన్నతి, కారుణ్య నియామకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లో కలిసి తెలంగాణ గ్రామ రెవిన్యూ సహాయకుల ఐక్య కార్యచరణ కమిటీ నేతలు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో వీఆర్ఏల భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని, సమగ్రకుటుంబ సర్వే, రేషన్ కార్డులు మొదలు రైతుబందు, బీమా, హరితహారం, కళ్యాణలక్ష్మీ, రెవెన్యూ విదులు ఇలా ఏ అంశంలోనైనా ప్రతీ లబ్దీదారుని గుర్తింపులో పాలుపంచుకోవడంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తున్నామని, తమ విషయంలో న్యాయబద్దమైన కోరికలను తీర్చవలిసిందిగా కోరారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో తమ సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారని గుర్తు చేసారు.

ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అద్యక్షుడు చెట్టి రవి, సెక్రటరీ నలువాల సాయి కిషోర్, పబ్బతి వెంకటరెడ్డి, గాజుల తిరుపతి, రేవంత్, గాండ్ల నవీన్, సంపత్ వర్మ, అవినాష్, చందన మాధవి, భాగ్యలక్ష్మీ, స్వరూప, కోమల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల‌ ఆర్థిక క‌ష్టాలు తీరేనా.. స‌కాలంలో జీతాలందేనా!!!

Sub Editor

‘పెద్దల’ ఆశీస్సులతో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

Satyam NEWS

ఇంటి ఆడబిడ్డలను గౌరవించు కోవడం మన సాంప్రదాయం

Satyam NEWS

Leave a Comment