31.2 C
Hyderabad
February 14, 2025 20: 14 PM
Slider హైదరాబాద్

పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

sajjanar 16

పెట్రోలింగ్ విధుల్లో బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందికి 17 వర్టికల్స్ లో భాగంగా ట్రైనింగ్ సెషన్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. నేర ప్రవృత్తి గల వ్యక్తులు, ఆర్థిక నేరగాళ్ల వివరాలను గుర్తించి వారిపై నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. నేర నియంత్రణ కోసం పెట్రోల్ కార్ అధికారి ఏరియాలో తరచూ నేరాలు జరిగే ప్రదేశాల్లో TS-COP అప్లికేషన్ ద్వారా గుర్తించి, తరచు గస్తీ నిర్వహించాలన్నారు.

బ్యాంకుల వద్ద ఎటిఎంల వద్ద సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా జనసంచారం లేని సమయాలలో తిరుగుతున్న అనుమానాస్పద వ్యక్తులను విచారించాలన్నారు. పాయింట్ బుక్ లను తరచుగా తనిఖీలు చేయాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు వివరిస్తూ ఇంటర్నెట్ మొబైల్ ద్వారా పోలీస్ సేవలు ఏ విధంగా పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కాలనీల్లోని ప్రజలతో వాణిజ్య సంస్థలు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు వెల్ఫేర్ అసోసియేషన్ అపార్ట్ మెంట్ కమిటీలు స్కూల్స్, కాలేజీలు నిరంతరం కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు.

పెట్రోల్ కార్ కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ కు  ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు తక్షణమే స్పందించాలని సమస్యలపై తక్షణం స్పందించి అతి తక్కువ సమయంలో బాధితులకు రక్షణ సాయం అందించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ , డీసీపీ క్రైమ్స్ రోహిణీ ప్రియదర్శినీ, ఎస్బి ఏసీపీ రవికుమార్, పెట్రోలింగ్ అండ్ బ్లూ కోల్ట్స్ కు చెందిన ఫస్ట్ బ్యాచ్ కు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఏలోపింగ్ టీచర్: ఆమెకు 26 అతనికి 14 లేచిపోయారు

Satyam NEWS

అందుబాటులోకి అధిక పింఛను ఆన్లైన్ దరఖాస్తు

Murali Krishna

బదిలీ సమస్యలు తీర్చాలి: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ

mamatha

Leave a Comment