31.2 C
Hyderabad
May 3, 2024 00: 18 AM
Slider నిజామాబాద్

బిచ్కుంద డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం

#bichkundacollege

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా గతంలో ఈ కళాశాలకు న్యాక్ బృందం సందర్శించి (సీ) గ్రేడ్   గుర్తింపు ఇవ్వగా ప్రభుత్వం నుండి రెండు కోట్ల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం మంజూరు అయ్యాయి.

కళాశాల అభివృద్ధికి ఆ నిధులను ఏవిధంగా వినియోగించాలా అనే అంశంపై ఈ సమావేశం జరగగా కళాశాల ప్రహరీగోడ, అదనపు తరగతి గదుల నిర్మాణం,విద్యార్థులకు  సౌకర్యవంతంగా ఉండేందుకు లైబ్రెరీ కంప్యూటర్లు తోపాటు పలు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఈ నిధులను వినియోగించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. పనులను కూడా త్వరలోనే ప్రారంభించి రెండు నెలల్లో పూర్తిచేస్తామని కాంట్రాక్టరు తెలిపారు.

కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్తోపాటు కోలావర్   శివకుమార్, మలికార్జునప్ప షెట్కార్, అసద్ అలీ, బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, డాక్టర్ రాజు, గుండెనెమ్లి సర్పంచ్ కిష్టారెడ్డి పుల్కల్  వైస్ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు  గణేష్ గొoడా, నారం సుదర్శన్, నూకల రాజు, విద్యాశాఖ ఇఈ గంగాధర్ గౌడ్  తదితరులు ఉన్నారు.

జీ లాలయ్య,  సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్

Related posts

మయన్మార్ నేత సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష

Sub Editor

ఆసియా కప్: ఫైనల్ మ్యాచ్ లో ‘‘మెరుపు తీగ’’ పై చర్చ

Satyam NEWS

మంత్రి పువ్వాడను కలిసిన హరికృష్ణ

Bhavani

Leave a Comment