28.7 C
Hyderabad
April 26, 2024 08: 45 AM
Slider క్రీడలు

ఆసియా కప్: ఫైనల్ మ్యాచ్ లో ‘‘మెరుపు తీగ’’ పై చర్చ

#urvasiroutela

దుబాయ్ స్టేడియంలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సమయంలో చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు వీడియో రూపంలో సోషల్ మీడియాలో సంచలనం గా మారింది. ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ పై శ్రీలంక జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తీవ్రమైన ఆందోళనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఓటమిపాలు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘ఈ మ్యాచ్ సంగతి ఎలా ఉన్నా ఇదుగో ఈ మెరుపు తీగ కోసం మ్యాచ్ మొత్తాన్ని చూడవచ్చు’’ అంటూ ఇస్తాక్ అహ్మద్ అనే మీమ్ క్రియేటర్ ఒక వీడియోను బయటకు విడుదల చేశారు. ఆ వీడియోలో ఒక అప్సరస లాంటి అమ్మాయి ఉంటుంది.

ఆ అమ్మాయిని మ్యాచ్ తిలకించిన ప్రతి ఒక్కరూ కూడా చూసే ఉంటారు కానీ అందుకు సంబంధించిన వివరాలు ఎవరికి తెలియవు. ఇస్తాక్ అహ్మద్ తన మీమ్ ను బయటకు వదలడంతో ఆ ‘‘ మిస్టరీ గర్ల్’’ ఎవరు అంటూ అందరిలో ఆసక్తి రేగింది. వర్ధమాన సినీ నటి ఊర్వశీ రౌతాలా అంటూ కొందరు కామెంటు పెట్టారు. ఆమె భారత క్రికెటర్ రిషబ్ పంత్ అభిమాని అట. అయితే ఇప్పుడు  రిషబ్ పంత్ కాకుండా పాకిస్తానీ బౌలర్ నసీమ్ షా అభిమానిగా మారిందని అంటున్నారు.

ఈ వీడియోలో ఉన్న బ్యూటీని చూసి నసీమ్ షా నవ్వాడని అందువల్ల ఊర్వశీ రౌతాలా నసీమ్ షా అభిమానిగా మారిందని అందుకే పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ చూడటానికి వచ్చిందని మరి కొందరు వ్యాఖ్యానించారు. పాక్ బౌలర్ నసీమ్ షా పేరు ఊర్వశి రౌతేలాతో జత చేసి గతం నుంచి కూడా వినిపిస్తోంది. ఊర్వశి రౌతేలాను చూసి నసీమ్ షా నవ్వుతున్న వీడియో గతం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తనకేం తెలీదంటున్న నసీమ్ షా

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలలో ఒకదానిలో నసీమ్ షా కూడా కనిపించాడు. దీనికి సంబంధించి, సోషల్ మీడియాలో, వినియోగదారులు వారిద్దరి పేర్లను జోడించారు. దీనిపై నసీమ్ షాను ప్రశ్నించగా.. ఈ విషయంపై తనకేమీ తెలియదన్నారు. ఊర్వశి రౌతేలా ఎవరో నాకు తెలియదు. ప్రస్తుతం నేను నా ఆటపైనే దృష్టి పెడుతున్నాను. ఇవన్నీ నేను పట్టించుకోను అని నశీమ్ షా అన్నడు.

ఇదే సమయంలో ఊర్వశి రౌతేలా ప్రకటన కూడా వచ్చింది. మా బృందం దాదాపు 11-12 వీడియోలను అభిమానులతో పంచుకున్నట్లు ఊర్వశి రౌతేలా తెలిపారు. వీడియోలో ఎవరు వస్తున్నారనే దానిపై దృష్టి పెట్టలేదు అని ఆమె కూడా చెప్పింది. దీనికి సంబంధించి ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై పుకార్లు ప్రచారం చేయవద్దని చెప్పింది. ఇలా కారణం ఏదైనా ఊర్వశి రౌతేలా నిరంతరం మీడియా హెడ్‌లైన్స్‌లో ఉంటుంది.

ఆ బ్యూటీ పేరు నైలా అహ్మద్

అయితే ఇంతకీ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఊర్వశి రౌతాలానేనా అనే విషయంపై స్పష్టత లేదు. ఆ అమ్మాయి ఊర్వశి రౌతాలా కాదని, పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి క్రికెట్ చూసేందుకు వచ్చిన నైలా అహ్మద్ అని ఒక వ్యక్తి ఆ వివరాలు వెల్లడించాడు. క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడకుండా ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అమ్మాయిలపై కామెంట్లు చేస్తారా? మీకు అక్కా చెల్లెళ్లు లేరా అంటూ మరి కొందరు ఆ మీమ్ క్రియేటర్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Related posts

అంబర్ పేట్ లో పని చేయని తాగునీటి బోర్ లు

Satyam NEWS

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి

Satyam NEWS

బహరైన్ లో విరిసిన తెలంగాణ పూల సంబురం

Satyam NEWS

Leave a Comment