26.7 C
Hyderabad
May 16, 2024 11: 01 AM
Slider విజయనగరం

అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ ను కాపాడాల్సిన అవసరం ఉంది

#ashokgajapatiraju

పద్నాలుగు నెలలు జైల్లో ఉన్న నాటి జగన్.. ప్రస్తుతం సీఎం జగన్ గా అవతారం ఎత్తి…. రాష్ట్రాన్ని దివాలా తీయించారని టీడీపీ నేత ,మాజీమంత్రి చింత కాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. విజయనగరం లో పార్టీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో కేంద్ర మాజీమంత్రి అశోక్ తో,బుద్ధా వెంకన్నలతో మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ హాయాంలోనే…అన్ని పార్టీల తో కలిసామని…ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కలిసి పని చేస్తామన్నారు.

గతంలో వామపక్ష పార్టీల తో కలిసామని..చంద్రబాబు హాయాంలోనూ కలిసి అప్పటి ఉమ్మడి ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్ల మని అయ్యన్న గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రం అథోగతి పాలైందని…గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు జాతీయ పార్టీలని…వాటివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదని…ప్రాంతీయ పార్టీల అవసరం ఎంతైనా ఉందన్నారు.

ప్రస్తుతం టీడీపీ అదే పనిలో ఉందని… ప్రాంతీయ పార్టీలను కలుపుకునే పనిలో ఉందన్నారు.అమరావతి నుంచీ అరసవల్లి వరకు రైతులు చేపడుతున్న పాదయాత్ర కు..మా పార్టీ ని మద్దతు కోరడం తప్పా అని ప్రశ్నించారు.ప్రజాస్వామ్యం లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం.. ప్రజలకు మేలు చేయకపోతే అదే ప్రభుత్వం అని ప్రశ్నించారు. రోజుల తరబడి అమరావతి రాజధాని కావాలంటూ అక్కడే ధర్నా చేపట్టిన ప్రభుత్వం స్పందిక పోవడంతో రైతులు ధర్నా కు దిగారని…అయినా స్పందన లేకపోతే పాదయాత్ర చేపట్టారని…అయ్యన్నపాత్రుడు వివరణ ఇచ్చారు.

అందుకు ప్రతి పక్ష పార్టీ మద్దతు కోరడం ప్రజాస్వామ్యం లో ఓ పద్దతి అని..ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతు ఇచ్చిందన్నారు. దీనిపై కూడా లేని పోని అర్ధం పర్ధం లేని ఆరోపణలతో విమర్శించడం తగదన్నారు. ఆ పాదయాత్ర ఉత్తరాంధ్ర లో మద్దతు కూడగట్టేందుకు మా ప్రయత్నం కోసం… సమావేశం అయ్యామన్నారు…అయ్యన్నపాత్రుడు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు… నాగార్జున… జిల్లా నేతలు పాల్గొన్నారు.

Related posts

సత్యం న్యూస్ కథనంతో కదిలిన పోలీసు యంత్రాంగం

Satyam NEWS

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

Satyam NEWS

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment