28.7 C
Hyderabad
April 27, 2024 06: 17 AM
Slider జాతీయం

తవాంగ్ కు చేరుకోవడానికి టన్నెల్ మార్గం రెడీ

#selapass

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆట కట్టించడానికి భారత్ అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నది. చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన మధ్య అసలైన నియంత్రణ రేఖ (LAC)పై తవాంగ్‌కు అన్ని రకాలుగా కనెక్టివిటీని భారత్ ఏర్పాటు చేసుకుంటున్నది. అందుకోసం సెలా పాస్ టన్నెల్ వేగంగా నిర్మించబడుతోంది. ఈ సొరంగం 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు.

సెలా పాస్ టన్నెల్‌ను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మిస్తోంది. ఈ సొరంగం 2023 జూలై నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఉద్యోగి నంద్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్మీ సిబ్బంది, ఆ ప్రాంత ప్రజలు తవాంగ్ చేరుకోవడానికి బలిపర-చారిదూర్ రహదారిని ఉపయోగిస్తున్నారని, శీతాకాలంలో అధిక మంచు కారణంగా సెలా పాస్ మార్గం ద్వారా కనెక్టివిటీ దెబ్బతింటుందని కిషోర్ చెప్పారు.

వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తుంటారు. సొరంగం పూర్తయిన తర్వాత దాదాపు 8-9 కి.మీ దూరం తగ్గుతుందని నంద్ కిషోర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో రెండు సొరంగాలు ఉంటాయి. టన్నెల్ 2లో ట్రాఫిక్ కోసం టూ-లేన్ ట్యూబ్, అత్యవసర పరిస్థితుల కోసం ఎస్కేప్ ట్యూబ్ ఉన్నాయి.

Related posts

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Bhavani

మళ్లీ ఫ్యాన్స్ మనసు గెల్చుకున్న ధోని

Sub Editor

నిరుపేదల పాలిట వరం CMRF పథకం

Satyam NEWS

Leave a Comment