33.7 C
Hyderabad
April 28, 2024 00: 13 AM
Slider రంగారెడ్డి

బయోఇన్ఫర్మేటిక్స్ మీద అతిధి ఉపన్యాసం

#cbit

సిబిఐటి లో ఎమ్సిఎ కోర్స్ విద్యార్థుల కోసం బయోఇన్ఫర్మేటిక్స్  మరియు దాని అనువర్తలు మీద అతిధి ఉపన్యాసం జరిగింది.  ఈ కార్యక్రమానికి అతిధి గా బయోటెక్నాలజీ విభాగ ఆధ్యాపకురాలు డాక్టర్ బి సుమిత్ర  బయోఇన్ఫర్మేటిక్స్  గురుంచి వివరించారు.

సుమిత్ర మాట్లాడుతూ బయోఇన్ఫర్మేటిక్స్ అనేది అనేక  పాఠ్యాంశల సముదాయం మరియు  సంక్లిష్ట బయోలాజికల్ డేటాను అర్థం చేసుకోవడంలో ఎంతో సహాయపడుతుంది.  మనము దీనిని  జీవశాస్త్రం మరియు సమాచార సాంకేతికత రెండింటి కలయికగా చూడవచ్చు. బయోఇన్ఫర్మేటిక్స్‌లో జీవసంబంధ అధ్యయనాలు ఉన్నాయి, వీటిని జన్యుశాస్త్రం మరియు పరిణామ అధ్యయనాల రంగంలో ఉపయోగించవచ్చు. ఔషధ రంగంలో, కొత్త ఔషధాల ఆవిష్కరణలో బయోఇన్ఫర్మేటిక్స్   పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.

డీయెన్ఎ  మరియు జీన్ డేటా సీక్వెన్సింగ్, కోడింగ్, సవరణ మరియు నిర్మాణ విశ్లేషణ   లో  బయోఇన్ఫర్మేటిక్స్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.  బయోఇన్ఫర్మేటిక్స్ ని ప్రొటీన్ నిర్మాణాన్ని గుర్తించడం, వ్యాధులతో సంబంధం ఉన్న జన్యువులను గుర్తించడం, అర్థవంతమైన నమూనాల అన్వేషణలో  మరియు   ఔషధాలను పునర్నిర్మించడం లో ఎంతో పాత్ర పోషిస్తున్నది.

ఈ కార్యక్రమంనికి ఎమ్ సి ఎ విభాగ అధ్యాపకుడు డాక్టర్ జి యెన్ ఆర్ ప్రసాద్ సమన్వయకర్త గా వ్యహరించారు.

Related posts

బీజేపీతో జనసేన పవన్ కల్యాణ్ కటీఫ్ చెప్పాలి

Satyam NEWS

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ రాక్షసులు

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంద కృష్ణమాదిగ భేటీ

Satyam NEWS

Leave a Comment