37.2 C
Hyderabad
April 30, 2024 11: 56 AM
Slider క్రీడలు

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన పసుపులేటి పవన్

#handball

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి రాజంపేట మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వసుపులేటి బ్రహ్మయ్య 67 వ జయంతి సందర్భంగా ఆయన కుమారులలైన జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ పసుపులేటి వీర ప్రదీప్ కుమార్, ఆర్గనైజ్ సెక్రెటరీ పవన్ కుమార్ లు పసుపులేటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక రోడ్డులోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల నందు 45వ రాష్ట్ర స్థాయి బాలికల అండర్ 19 హాండ్ బాల్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. వీరందరికీ పసుపులేటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాన్వి పాఠశాలలో భోజన రవాణా వసతి తో పాటు అన్ని రకాల వసతులను కల్పించారు.

ఈ సందర్భంగా శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి క్రీడా దుస్తులను అందజేశారు. అనంతరం కోచ్ లు, మేనేజర్లు, రెఫరీస్ లు స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, రాష్ట్రఆర్గనైజ్ సెక్రెటరీ రామాంజనేయులు, టెక్నికల్ కమిటీ చైర్మన్ ఎస్ చంద్రశేఖర రావు, రిఫ్రిస్ బోర్డు చైర్మన్ ఎం. సురేష్ కుమార్ ల ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేసి బీహార్ రాష్ట్రంలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు జాతీయస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొండూరు భరత్ కుమార్ రాజు, ప్రిన్సిపాల్ విజయనిర్మల, సిగ జయరాం, శ్రీనిధి, ప్రభాకర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆరుగాలం కష్టించిన అన్నదాత ప్రతిఫలంపై మొద్దునిద్రలో కేంద్రం

Satyam NEWS

18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదుకు ప్రత్యేక డ్రైవ్

Bhavani

Bollinger Bands Example

Bhavani

Leave a Comment