31.2 C
Hyderabad
May 3, 2024 00: 35 AM
Slider మహబూబ్ నగర్

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన  జిల్లా కలెక్టర్

#wanaparthycollector

వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీలలోని రెండు హామీలు ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పది లక్షలతో వైద్యం పథకాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టర్ను విడుదల చేసి ప్రారంభించారు. రెండవది మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని జెండా ఊపి  జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచారని, దీంతో పేదలందరికీ 10 లక్షల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అమలవుతుందన్నారు. ఇంతకు ముందు ఆరోగ్య శ్రీ లో 5 లక్షలు వరకు ఉన్న వైద్య సదుపాయాన్ని 10 లక్షల వరకు పెంచటం వల్ల పేద కుటుంబాలకు ఎంతగానో అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంపనల్డ్ ఆసుపత్రులలో తక్షణమే అమల్లోకి వస్తుందని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలియజేశారు.  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యము ఈరోజు నుండి అమలులో ఉంటుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగపరుచుకోవచ్చని అన్నారు. ఆర్టీసీ బస్సులలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని అన్నారు. మహిళలు బస్సులలో ప్రయాణానికి తమ ఆధార్ కార్డును చూయించి తమ గమ్యస్థానాలకు ఉచితంగా ప్రయాణాలు సాగించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జయ చంద్ర మోహన్, అడిషనల్ డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి, సూపర్డెంట్ నరేందర్, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహ రెడ్డి, వనపర్తి డిపో మేనేజర్ వి.వేణుగోపాల్, అధికారులు అవినాష్, కౌన్సిలర్ బ్రహ్మం చారి, సుమిత్రా యాదగిరి, జయ సుధా, చిర్ల సత్యం, వెంకటేష్, చీర్ల చందర్, కిరణ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ గౌడ్, ఆర్టీసీ సిబ్బంది  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

పెరిగిన జీతాలతో సహా బకాయిలు చెల్లించకపోతే పోరాటం ఉధృతం

Satyam NEWS

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు

Satyam NEWS

Leave a Comment