33.2 C
Hyderabad
May 15, 2024 19: 40 PM
Slider హైదరాబాద్

చెత్త ఆటోలపై ఇంత దౌర్జన్యమా..?: సిపిఎం మహేందర్

#amberpet

చెత్త ఆతోలపై ఇంత దౌర్జన్యమా అని సిపిఎం నాయకులు మహేందర్ ప్రశ్నించారు. అంబర్ పేట్ నియోజకవర్గంలో ఇంటింటికి చెత్త సేకరించే ఆటో కార్మికులు చెత్తను సేకరించిన తర్వాత వారి ఆటోలని బతుకమ్మ కుంట లోని వాళ్ళ ఇంటి దగ్గర రోడ్డు పై పార్కు చేస్తారు. 

ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేయడంతో నేడు ట్రాఫిక్ పోలీస్ వారు వారి ఆటోలను అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న బతుకమ్మ కుంట ఖాళీ స్థలంలో పార్కు చేస్తుండగా భూ కబ్జాదారులు ఎడ్ల సుధాకర్ రెడ్డి అక్కడకి వచ్చి ఆటో కార్మికులను కులంతో పేరుతో దూషించడంతో పాటు ఈ ప్రాంతం భూమి నాది అని చెప్పి ఆడవాళ్ళని చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.  ఎడ్ల సుధాకర్ రెడ్డి పై అంబర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని సిఐ సుధాకర్ కు సీపీఎం మహేందర్ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆటో కార్మికుల సమస్యలపై ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా  నిర్వహించారు.

చెత్త రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్లి చెత్తా చెదారాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తూ వారి ఆటోలను రోడ్డుపై పార్కు చేస్తున్నందుకు చుట్టుపక్కల వాళ్ళు అభ్యంతరంగా ఉందని తీవ్ర అంతరాయం జరుగుతుందన్నారు. కాబట్టి ఖాళీగా స్థలం ఉందని, మేము ఎలాంటి అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ చేయడం లేదని ప్రభుత్వ సూచనల మేరకే చెత్త సేకరించి పనులు చేసుకుంటున్నామని అన్నారు.

ప్రభుత్వమే మాకు ఆటోలు కేటాయించిందని దీనికి గాను చెత్త ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని చెత్త ఆటోవాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, వెంకయ్య, బాలకృష్ణ, నాగులు, కురుమయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు.. డీజీపీ

Sub Editor

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం

Satyam NEWS

డైమండ్ వార్:వృద్ధుడిని చితక బాది వజ్రం దోచుకెళ్లారు

Satyam NEWS

Leave a Comment