37.2 C
Hyderabad
May 2, 2024 14: 41 PM
Slider గుంటూరు

తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం

#telugusevasamiti

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని అన్నా క్యాంటీన్ భవనాలలో యాచకులకు,నిరుపేదలకు “తెలుగు సేవా సమితి”ఆధ్వర్యంలో ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం అందించేందుకు అనుమతినివ్వాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను తెలుగు సేవా సమితి అధ్యక్షులు డా॥గోదా రమేష్ కుమార్ ఈరోజు ఉదయం స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని అనాథలకు,యాచకులకు,నిరుపేదలకు తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం అందించాలని విదేశాలలో ఉన్న తెలుగు సేవా సమితి ప్రతినిధులందరూ కలసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని నరసరావుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్లలో కుల,మత,రాజకీయాలకు అతీతంగా  అల్పాహారం,భోజనం అందించేందుకు అనుమతినివ్వాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను కోరామని అధికారులు అనుమతిస్తే నరసరావుపేట వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను నిర్వహించేందుకు తెలుగు సేవా సమితి సిద్దంగా ఉందని తెలిపారు.

సేవా కార్యక్రమాలు కుల,మత,రాజకీయాలకు అతీతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని తెలుగు వారి అభివృద్ది,సంక్షేమం కోసం ఎనలేని కృషిచెస్తున్నామని ఇప్పటికే విదేశాలలో ఉద్యోగాల పేర్లతో మోసపోయిన  ఎంతోమంది నిరుద్యోగులను విదేశాలలో ఉన్న తెలుగు సేవా సమితి ప్రతినిధులందరూ సంరక్షించి విదేశాల వ్యవహారాల మంత్రులతో కలసి మాట్లాడి స్వదేశాలకు పంపడం జరిగిందని తామంతా నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగానే తెలుగు సేవా సమితి ప్రతినిధులందరం కలసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Related posts

పైడితల్లి తొలేళ్ల పండుగ లో తప్పిపోయిన 4 ఏళ్ల చిన్నారి..

Satyam NEWS

లేఅవుట్ ఆస్తుల ట్రస్టీలా లేక భక్షకులా!

Sub Editor

రషీద్ ఎన్ కౌంటర్

Murali Krishna

Leave a Comment