29.7 C
Hyderabad
May 6, 2024 03: 46 AM
Slider హైదరాబాద్

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు.. డీజీపీ

Mahender-Reddy-2

గత ఆరేళ్లుగా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ పోలీసులు శాఖ విధులు నిర్వహిస్తోంద‌ని, GHMC ఎన్నికలను ఆసరాగా తీసుకోని మత ఘర్షణకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కచ్చితమైన సమాచారం త‌మ వ‌ద్ద ఉంద‌ని డిప్యూటీ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. ఈ సంద‌ర్భంగా గురువారం ప్రెస్‌నోట్‌ను డీజీపీ ఆఫీస్ నుంచి విడుద‌ల చేశారు.

విధ్వంస‌క శ‌క్తుల‌ను అడ్డుకునేందుకు అప్ర‌మ‌త్తం

విధ్వంసక శక్తులను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలి. మూడు పోలీస్ కమిషనరేట్ లో అన్ని విభాగాలు కలుపుకొని విధులు నిర్వహిస్తారు. కమ్యునల్ గొడవలు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం ఉంది.

మ‌త‌ఘ‌ర్ష‌ణ కుట్ర‌దారుల‌పై నిఘా

వీటిపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశారు విచారణ జరుపుతున్నారు. రోహింగ్యాల విషయంలో 60కి పైగా కేసులు నమోదు అయ్యాయి. మత ఘర్షణలు జరిపేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ పై మా నిఘా ఉంది.

అవ‌స‌ర‌మైతే యాక్ష‌న్‌

కమ్యునల్ ఘర్షణలు చేసే వాళ్ళు అవకాశం కోసం చూస్తారు! రహస్య సమాచారాన్నిమేము బయటపెట్టలేం.. అవసరం అనుకున్నప్పుడు యాక్షన్ ఉంటుంద‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. అన్నిరాజకీయ పార్టీల సభలకు-ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నామ‌న్నారు.

నిర్భ‌యంగా ఓటు హ‌క్కు వినియోగించుకోండి

తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉంది. గత 6 సంవత్సరాలు ప్రజల సహకారంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంది. Ghmc ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును నియోగించుకోవాలి. Ghmc ఎన్నికలను ఆసరాగా తీసుకుని హైదరాబాద్ మత ఘర్షణలు తీసుకురావాలని చూసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసాం. వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు.

రెచ్చ‌గొట్టే పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు

అలాగే సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసాం. రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి వారిని గుర్తిస్తున్నామ‌న్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఒక‌వేళ సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వ‌రికీ పంప‌వ‌ద్ద‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు.

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అవ‌స‌రం

ఈ విష‌యంలో ప్రజలంద‌రు కూడా పోలీసులతో భాగస్వామ్యం కావాల‌న్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో 51 వేల 500 మంది తో భారీ భద్రత ఏర్పాటు చేశామ‌ని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు.

Related posts

అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు

Satyam NEWS

కమలం కల నెరవేరేనా?

Satyam NEWS

వచ్చే నెల నుంచి లబ్ధిదారుల ఇంటికే నేరుగా పెన్షన్లు :జగన్‌

Satyam NEWS

Leave a Comment