29.7 C
Hyderabad
May 4, 2024 04: 40 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే నుండి ప్రాణ హాని ఉంది…. నాకు న్యాయం చేయండి

కొంతకాలంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న నల్లమట్టి దందా,ఇసుక దందా, విద్యార్థుల ఉద్యోగ సమస్య,పలు ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ని ప్రశ్నిస్తూనందుకు కక్ష గట్టి కొంత మంది టి.ఆర్.ఎస్ గుండాలు దాడులు చేశారని ఎద్దుల విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాడు.

ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినా చట్టపరంగా ఇంకా చర్యలు తీసుకోలేదని,స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కొంత మంది దుండగులను గుర్తించి పోలీస్ వారికి చెప్పినా ఎఫ్.ఐ.ఆర్ నమోదు మాత్రం ఒక్కరి పేరు మీదనే నమోదు చేసి,తక్కువ శిక్షలు పడే సెక్షన్లను నమోదు చేయడం జరిగిందని బాధితుడు వాపోయాడు.

మిగతా వారిని రక్షించుట పోలీసులు ప్రయత్నించడం జరుగుతుందని తెలిసి ఈ విషయంపై జిల్లా ఎ.స్పీ గారిని పలుమార్లు కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధపడ్డాడు. వీరికి రాజకీయ అధికార టి.ఆర్.ఎస్ పార్టీ అండదండలు ఉండడంవల్ల ఇంతవరకు మిగతా వారిపై చర్యలు తీసుకోవడం లేదని,నిరంతరం వారు చేసే అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు తిరిగి అట్రాసిటీ,విధులకు ఆటంకం కలిగించాడని రాజకీయ పలుకుబడితో రెండు కేసులు అక్రమంగా నమోదు చేశారని ఆయన ఫిర్యాదు చేశారు.

తన కుటుంబ సభ్యుల పై అమానుషంగా, అతి క్రూరంగా,ఇంట్లోకి చొరబడి దాడి చేసినా దుండగులను ఇంత వరకు అరెస్టు చేయలేదని ,వారిని కాపాడే ప్రయత్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో, వారి కార్యకర్తలతో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలియజేశారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులను కాపాడి భౌతిక దాడులకు దిగి,దూషించి, అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై సి.ఆర్.పి.సి. 166,219, సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం డీఎస్పీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Sub Editor

మిడతల దాడి నుంచి రక్షణ ఏర్పాట్లతో సన్నద్ధం

Satyam NEWS

కరోనా వాక్సిన్ విషయంలో మానవ కోణం అవసరం

Satyam NEWS

Leave a Comment