40.2 C
Hyderabad
May 2, 2024 17: 25 PM
Slider మహబూబ్ నగర్

ఉద్యమ నాయకులను బూటు కాళ్లతో తన్నిస్తుంటే ఎలా రావాలి?

ఉద్యమాలతో పురుడు పోసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. ఎంతో మంది ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు జీవితాలను త్యాగం చేశారు. పార్టీ పరంగా పక్కన పెడితే.ఇదే ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎందరో ఉన్నారు.

ఇదే సమయంలో యువత ప్రాణాలు, ఉద్యోగుల ప్రాణాలు పోతుంటే, వారి ఆత్మబలిదానాలను చూసి చలించిపోయి ఉద్యమానికి ఊపిరి పోసి, టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు ఎందరో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు మంత్రి పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

ఓటు బ్యాంకు లేని చోట టిఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకుతో పాటు అసెంబ్లీ సీట్లు వచ్చేలా చేశారు.వారిలో ఒకరే తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.జూపల్లి రాజీనామాతో మరికొందరిలో చలనం వచ్చింది.పదవులను వదులుకొని ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

అక్కడితో ఉద్యమం ఊపందుకుంది. కేవలం ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతుందని మాత్రమే అని ఆ పార్టీలో చేరారు. ఇది వాస్తవం.మరి ఆ ఉద్యమ పార్టీలో పదవులను త్యాగం చేసి ఉద్యమానికి ఊపిరి పోసి ఆ పార్టీకి అండగా నిలిచిన ఆనాటి నేతల పరిస్థితి నేడు ఏ విధంగా ఉంది.?

ఉద్యమానికి అడ్డు నిలిచిన వారికి పదవులు

అనాడు ఎవ్వరైతే తెలంగాణకు అడ్డు వచ్చారో,అడ్డు నిలిచారో వారే నేడు పదవులలో ఉన్నారు.ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీని దూషించిన వారు,కేసీఆర్ ను విమర్శించిన వారు, అనేక మాటలు అన్న వారు ఉన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను కూడా ఎగతాళి చేసిన వారు కూడా ఇప్పుడు పదవులలో కొనసాగుతున్నారు.

ఉద్యమం గురుంచి మాట్లాడుతున్నారు.మరి ఇలా ఉంటే. ఆనాడు విద్యార్థులు యువత ఆత్మబలిదానం చూసి చలించిపోయిన నేతలు నేడు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. కొందరికి ఆత్మగౌరవ ఉండకపోవచ్చు కానీ ఆత్మగౌరవం ఉన్నవారిని ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం కానీ ఆత్మ గౌరవం అనేది ముఖ్యం. ఆత్మగౌరవం కోసమే నేడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కు అధిష్టానం ఆహ్వానం అందినా కానీ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న జూపల్లి కృష్ణారావు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొనడం లేదనీ సమాచారం.

పార్టీ ముఖ్య నేత ద్వారా ఆహ్వానం.. అసంతృప్తి వ్యక్తం చేసిన జూపల్లి?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిందని సమాచారం. అయితే ఆ సమయంలో తన నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలకు, జైలకు వెళ్లిన వారిని నేడు కూడా అలాగే జరుగుతున్నాయని గుర్తు చేసినట్లు తెలుస్తుంది.

ఉద్యమ నాయకులను,ప్రజలను పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తున్న ఘటనలపై చర్చించినట్లు తెలుస్తుంది.అక్రమ కేసులతో అనేక వేదింపులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పినట్లు సమాచారం. ఎవరైతే ముఖ్యమంత్రినీ విమర్శించారో, టిఆర్ఎస్ పార్టీని విమర్శించారో వారే నేడు పార్టీలో చేరి ఉద్యమ నాయకుల పై పోలీస్ లతో అక్రమాకేసులు,దాడులు చేయిస్తూ, కక్ష సాధింపులు చేయిస్తున్నారని వారు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్లు, రాష్ట్ర ఉన్నతస్థాయి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకపోయిన తగిన చర్యలు తీసుకోకపోవడంపై జూపల్లి అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. పదవులు వస్తాయి పోతాయి. కానీ ఆత్మగౌరవం ముఖ్యం.ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన అనుచరులను, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని జూపల్లి మాట్లాడినట్లు అందిన సమాచారం.అందుకే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం వచ్చిన జూపల్లి పాల్గొనడం లేదని, హాజరుకావడం లేదని తెలుస్తుంది.

ప్రజలను, అనుచరులు కంటికి రెప్పల జూపల్లి కాపాడుకుంటున్నారు. ప్రతి సమస్యపై జూపల్లి ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు పై, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. అందుకే నియోజకవర్గ ప్రజలు జూపల్లి పై మొగ్గుచపుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.వచ్చిన సర్వే ఫలితాలలో కూడా జూపల్లి కే అనుకూలంగా వచ్చినట్లు పార్టీ వర్గాలకు తెలిసిందే.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నెట్ నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

ముసద్దీలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ తనిఖీలు

Satyam NEWS

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం

Bhavani

సుదర్శన హోమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Satyam NEWS

1 comment

Raju April 27, 2022 at 10:08 AM

Jai jupally

Reply

Leave a Comment