33.7 C
Hyderabad
April 29, 2024 01: 45 AM
Slider ప్రపంచం

కరోనా వాక్సిన్ విషయంలో మానవ కోణం అవసరం

#CoronaVaccine

కోవిడ్- 19 పై పూర్తిస్థాయిలో నియంత్రణ కోసం అహరహం అనేక దేశాలు కృషిచేస్తున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిర్విరామ పరిశోధనలు సాగిస్తున్నాయి. వాక్సిన్ లేదా టీకాల దశలవారీ క్లినికల్ పరీక్షలు సత్ఫలితాలు ఇస్తున్న తీరు ఆశావహ సంకేతాలిస్తోంది.

సకల స్థాయి పరీక్షలను అధిగమించి వాక్సిన్ రోగులకు అందించాల్సిన పరిస్థితిలో..వాటి పంపిణీ బాధ్యత తీసుకునేందుకు యూనిసెఫ్ ముందుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిశోధన లు, వాటి ఫలితాలపై వచ్చిన సమగ్ర నివేదికల ఆధారంగా ప్రజల అవసరాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో రోగులకు యూనిసెఫ్  పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కృతనిశ్చయంతో ఉన్న యూనిసెఫ్

సంపన్న దేశాలతో పోటీపడలేక వెనుకంజలో తృతీయ ప్రపంచ దేశాలలో వైరస్ బాధితులను ఆదుకునేందుకు యూనిసెఫ్ కృతనిశ్చయంతో ఉంది. దేశాలవారీగా, కోవిడ్ బాధితుల సంఖ్యకు అనుగుణంగా వాక్సిన్ అందించేందుకు డోసుల కోసం అభ్యర్ధన మొదలు వాటిని సక్రమంగా పంపిణీ చేసే వరకు పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించనున్నట్లు సంస్థ అధికారులు ప్రకటనలో తెలిపారు.

ప్రపంచంలో ఏ దేశమైనా…యూనిసెఫ్ పర్యవేక్షణలోనే వాక్సిన్ పంపిణీ జరగాలని నిర్ణయించడం ఐరోపా, దక్షిణాసియా దేశాలకు కలిసివచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో…మూడింట రెండు వంతు బాలలు అతి దుర్భర పరిస్థితిలలో జీవనం సాగిస్తున్న సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలలో యూనిసెఫ్ తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

కరోనా దెబ్బకు ఇప్పుడు ఉన్న పేదరికం 15 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు 8.6 కోట్లకు పైగా  అల్ప, మధ్యాదాయ వర్గాలకు చెందిన చిన్నారులు కొత్తగా పేదరికం బారిన పడినట్లు యూనిసెఫ్ జూన్ నెలలో నిర్వహించిన నివేదిక తెలిపింది.

వాక్సిన్ ను వ్యాపార వస్తువుగా చూడవద్దు

పౌష్టికాహార లోపం కారణంగా కోట్లాది చిన్నారులు ప్రమాదకర పరిస్థితులలో ఉన్నట్లు నివేదిక సారాంశం. కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన నేపథ్యంలో వాక్సిన్ ను వ్యాపార వస్తువుగా పరిగణించి, సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశాలను ధనిక దేశాలు విడనాడాలని ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు సూచించారు.

మహమ్మారి పీడిస్తున్న సంక్లిష్ట సమయంలో మానవీయ కోణానికి పెద్దపీట వేయాలని వారు హితవు పలికారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో వాక్సిన్ పంపిణీ కి సభ్యదేశాలు విశాలహృదయంతో సహకరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని  క్షేత్రస్థాయిలో యూనిసెఫ్ తో కలసి పనిచేస్తున్న చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ సీఈఓ ఇంగేర్ అషింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేన్రి ఎట్టా ఫార్ నివేదికలో ప్రకటించినట్లు “కోవిడ్ వైరస్ సమూల నివారణకు ఉద్దేశించిన  వాక్సిన్ పంపిణీ వ్యవహారంలో వివక్షకు, పక్షపాతానికి తావులేని విధంగా రూపుదిద్దుకుంటున్న కార్యాచరణకు సభ్యదేశాలు పాజిటివ్ గా స్పందించాల్సిన కీలక సమయం ఇది.

(ఐక్యరాజ్య సమితిలో భాగ మైన అంతర్జాతీయ బాలల అత్యవసర నిథి( యూనిసెఫ్) తాజా నివేదిక ప్రకారం)

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

త్వరలో 41వ డివిజన్ కు మరో రూ. 70 లక్షలు

Bhavani

రైల్లోనే తుపాకితో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్

Satyam NEWS

శ్రీ‌లంక బోట్‌లో వంద కిలోల‌ హెరాయిన్ స్వాధీనం!

Sub Editor

Leave a Comment