28.7 C
Hyderabad
April 28, 2024 10: 12 AM
Slider ప్రపంచం

కమలా హారిస్ కు కరోనా పాజిటీవ్

#kamalaharris

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కమలా హారిస్ కు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించారు. దాంతో కరోనా రిపోర్ట్ పాజిటీవ్ గా వచ్చింది. అయితే, హారిస్‌కు కరోనా లక్షణాలు పెద్దగా లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.

ప్రెసిడెంట్ జో బిడెన్‌తో ఆమె కలవలేదని అందువల్ల అధ్యక్షుడి ఆరోగ్యంపై అనుమానాలు అవసరం లేదని తెలిపారు. కమలా హారిస్‌ కు ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. అయితే ఆమె ప్రస్తుతానికి ఐసోలేషన్‌లో ఉంటారు. ఉపరాష్ట్రపతి నివాసం నుండి పని చేయడం కొనసాగిస్తారు. హారిస్ CDC మార్గదర్శకాలు, వైద్య సలహాలను కచ్చితంగా పాటిస్తున్నారు. కరోనా తదుపరి పరీక్షలలో నెగెటీవ్ వస్తే ఆ తర్వాత వైట్ హౌస్‌కి తిరిగి వస్తారు. 57 సంవత్సరాల హారిస్, కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లతో పాటు బూస్టర్ డోస్‌ను కూడా ఇప్పటికే తీసుకున్నారు.

Related posts

ఇంటర్ విద్యార్ధులు అందరికీ ఓకే..?

Sub Editor 2

‘అల్లుడు అదుర్స్’ జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌

Sub Editor

రాష్ట్రపతిని కించపరిచిన పశ్చిమబెంగాల్ మంత్రిని అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment