29.7 C
Hyderabad
May 6, 2024 06: 28 AM
Slider ముఖ్యంశాలు

జగన్ ముఖ్య కార్యదర్శిపై అమిష్ షాకు ఫిర్యాదు

#TK Ramamani IAS

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి అయిన ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై వివాదం తీవ్ర రూపం దాల్చుతున్నది. నిజాయితీగల ఐఏఎస్ అధికారి టి కె  రమామణి ఆకస్మిక మరణంపై చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

ఈ మొత్తం వ్యవహారానికి ప్రవీణ్ ప్రకాష్ కారణమనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2010 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి టి కె రమా మణి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కార్యదర్శిగా పని చేసేవారు. అవినీతి అధికారులు ఉంటే ఆ పోస్టులో కోట్లు సంపాదించుకోవడానికి వీలుంటుంది.

అంతటి కీలకపోస్టులో ఉన్న రమామణి ని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రెండు కోరికలు కోరారని అవి తీర్చకపోవడంతోనే ఆమెపై కక్ష సాధింపు మొదలు పెట్టారని బిజెపి ఆంధ్రప్రదేశ్ సమన్వయ కర్త, అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురాం ఆరోపించారు.

ఇప్పటికే డివోపీటీకి ఫిర్యాదు

ఆయన ఈ మేరకు డివోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ )కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు ఆయన చర్యలు చేపట్టారు. ఆమె కమర్షియల్ ట్యాక్స్ శాఖలో పని చేస్తున్న సమయంలో నెలకు ఒక లక్ష రూపాయలు సీఎం పేషీ ఖర్చులకు పంపాలని, తనకు ఒక కారు కావాలని ప్రవీణ్ ప్రకాష్ అడిగారని రఘురాం డివోపీటీకి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిజాయితీగా పని చేసే రమామణి అలాంటివి తాను సమకూర్చలేనని చెప్పారు. దాంతో కక్షగట్టిన ప్రవీణ్ ప్రకాశ్ ఆమెను ఆ పోస్టు నుంచి బదిలీ చేసి తన కింద ఉన్న జీఏడీలో రిపోర్టు చేయమని చెప్పారు. అప్పటి నుంచి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎవరైనా సమాచారం అందిస్తే కమర్షియల్ ట్యాక్స్ విభాగం వారు పట్టుకున్న సొమ్ము నుంచి కొంత శాతం వారికి గిఫ్ట్ గా ఇస్తారు. ఇది ఎంతో గోప్యంగా జరుగుతుంది. ఇలా చెల్లించే నిధులకు ఆడిటింగ్ కూడా ఉండదు.

నిధుల కైంకర్యం కోసం రమామణిపై వత్తిడులు

ఈ నిధి నుంచి సొమ్మును మళ్ళించాలనే వత్తిడి కూడా రమామణిపై ఎక్కువగా ఉండేది. అయితే అలాంటి పనులు చేయనని ఆమె భీష్మించుకుని కూర్చోవడం వల్లే ఆమెను బదిలీ చేశారని రఘురాం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె మరణించిన వెంటనే ప్రవీణ్ ప్రకాష్ వెళ్లి ఆమె భౌతిక కాయానికి నివాళి అర్పించి వచ్చారు.

బతికి ఉన్నంత కాలం వేధించి కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేసిన ప్రవీణ్ ప్రకాష్ ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చారని అప్పటిలో విమర్శలు గుప్పుమన్నాయి. రమామణి ని తిరుమల తిరుపతి దేవస్థానాల జేఈవోగా నియమించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రవీణ్ ప్రకాష్ కు చెప్పారు.

జగన్ చెప్పినా పోస్టింగ్ ఇవ్వని ప్రవీణ్ ప్రకాష్

ఇదే విషయాన్ని రమామణి కి కూడా తెలిపారు. స్వామి సన్నిధిలో పని చేసే అదృష్ట భాగ్యం కలిగిందని ఆమె ఎంతో సంతోషంగా తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పోస్టింగ్ రాబోతున్నట్లు ఆమె ఆనందంగా ఉన్న సమయంలో ప్రవీణ్ ప్రకాష్ అడ్డుపడ్డారని రమామణి కుటుంబ సభ్యులు అంటున్నారు. దాదాపు నాలుగు నెలల పాటు ఆమెకు ఆర్డర్ ఇవ్వకుండా ఆయన చేశారు. ముఖ్యమంత్రి క్లియర్ చేసిన తన పోస్టింగ్ గురించి అడిగితే ప్రవీణ్ ప్రకాష్ లేనిపోని విషయాలను ప్రస్తావించి రమామణిని మానసిక వేదనకు గురి చేశారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

Related posts

విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాలి

Bhavani

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ

Satyam NEWS

అమెరికా వెలగాలంటే ఇండియాతోనే ఉండాలి

Satyam NEWS

Leave a Comment