29.7 C
Hyderabad
May 4, 2024 05: 39 AM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ ఎఫెక్ట్..  కలెక్టర్ పై లోకాయుక్తలో ఫిర్యాదు

#lokayukta

మాస్టర్ ప్లాన్ అంశం రోజురోజుకు రైతుల ఉద్యమ తీవ్రతను పెంచుతోంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని దానికోసం మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం ప్రవేశ పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తీర్మానం కోసం రేపటి మధ్యాహ్నం వరకు రైతులు గడువిచ్చారు. లేకపోతే చావో రేవో తేల్చుకుంటామని, ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేపట్టి కుటుంబంతో సహా అక్కడే తిష్ట వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ అంశం పొలిటికల్ నుంచి అధికారుల మెడకు చుట్టుకుంటోంది.

రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ లపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్, కలక్టరేట్లకు వచ్చిన రైతుల పట్ల నిర్లక్యం వహించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాది బుచ్చిరెడ్డి (బుచ్చిబాబు) ద్వారా లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.

త్వరలో కలెక్టర్ తో పాటు కమిషనర్ కు లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. మాస్టర్ ప్లాన్ అంశం ఇంకా ఎంతమంది మెడకు చుట్టుకుంటుందోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకుల స్వార్థ రాజకీయాలకు అధికారులు బలవుతున్నారన్న చర్చ కూడా సాగుతోంది. లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ. మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఉద్యమాల చేశామన్నారు.

మాస్టర్ ప్లాన్ చేసేటప్పుడు రైతులకు జోన్ల విషయంలో కనీస అవగాహన కల్పించలేదని తెలిపారు. ఉద్యమం చేసేటప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు రైతులు వెళ్తే కూడా నిర్లక్యంగా వ్యవహరించారని, దాదాపు 2వేల మంది రైతులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వస్తె వినతి పత్రం తీసుకోవడం కోసం కనీసం 5 నిమిషాల సమయం ఇవ్వని కలెక్టర్ తీరు పట్ల లోకాయుక్తలో కేసు పెట్టామన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ఆగదని, రైతులను ఇబ్బంది పెడితే న్యాయ పరంగా ఎంతదాకైనా వెళ్ళడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Related posts

తిరుమల భక్తుల దర్శనానికి ఆటంకం లేదు

Satyam NEWS

జ‌గ‌న‌న్న గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మంపై విజయనగరం జేడ్పీ చైర్మన్ సమీక్ష

Satyam NEWS

బీ అలెర్ట్: అద్దె దారుల తో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment