33.2 C
Hyderabad
May 3, 2024 23: 23 PM
Slider ప్రత్యేకం

కేంద్రానికి చేరిన మద్యం అమ్మకాలపై ఫిర్యాదులు

#Narendra Modi

లాక్ డౌన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఫిర్యాదులు వెళ్లినట్లే కనిపిస్తున్నది. మొత్తం ఎనిమిది మంది ఎంపిలు నేరుగా ప్రధాని నరేంద్రమోడీకి వేరు వేరుగా లేఖలు రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేపట్టడం అందులో లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం రాష్ట్రంలో పెను ఆరోగ్య సంక్షోభానికి దారి తీయవచ్చునని పార్లమెంటు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. లాక్ డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడం వల్లే కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కరోనా పాజిటీవ్ కేసులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఇప్పటికే పలు ఫిర్యాదులు కేంద్రానికి అందాయి.

కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లాలకు సంబంధించి వైసీపీ నాయకులు చేసిన చర్యలపై ఆయా జిల్లాల బిజెపి నాయకులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని వారు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా ఎలాంటి ప్రణాళిక లేకుండా జరుగుతుండటంతో సాధారణ ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కరోనా పై చులకన భావంతోనే ఉందని సీనియస్ నెస్ లేకపోవడం వల్ల కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయని పార్లమెంటు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఎనిమిది మంది ఎంపిలు కూడా వేరు వేరుగా లేఖలు రాయడం. దాంతో ప్రధాని కార్యాలయం ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వివరణ అడిగినట్లు తెలిసింది.

Related posts

ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ

Satyam NEWS

కరోనా వేళ…నిబంధనల మధ్య ఆది శంకరుల జయంతి

Satyam NEWS

డిమాండ్: కరోనా సేవ చేస్తున్న వారిని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment