37.2 C
Hyderabad
April 30, 2024 11: 16 AM
Slider నల్గొండ

ప్రభుత్వ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి

#saidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిఆర్ఎస్ కె.వి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కార్మికులకు ఇన్సూరెన్స్ వెల్ఫేర్ కార్డులు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసన సభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ  కార్మిక సోదర,సోదరీమణులు  అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని,  వెల్ఫేర్ కార్డులు జారీ అయిన వారికి  ప్రభుత్వం ద్వారా శిక్షణ కేంద్రాలు, ఇన్సూరెన్స్ సదుపాయాలు కలుగుతున్నాయి అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో  శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వ కళాశాల నందు శిక్షణ కేంద్రంలో నేర్చుకోవాలని కోరారు.ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సిఎం రిలీఫ్ ఫండ్,ఎ  ఓ సి ద్వారా సహాయం అందేలా చూస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,రెండో వార్డు కౌన్సిలర్ జక్కుల శంభయ్య, యూనియన్ అధ్యక్షులు ఎస్.కె ఆసియా,ఎస్ కె జాన్బి,లాలమ్మ,కోటి, వెంకటేశ్వర్లు,రాంబాబు,జానీ,నజీర్, కార్మిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వంటల దుకాణంలో ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీలు

Satyam NEWS

చికిత్స కోసం యువకునికి ఎల్ఓసి అందజేత

Satyam NEWS

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

Satyam NEWS

Leave a Comment