27.7 C
Hyderabad
May 7, 2024 10: 59 AM
Slider విజయనగరం

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు

#computer thieves

విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు జువైనల్ తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు విజయగనరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలైన తాశీల్దార్, ఎంపిడిఓ పాఠశాలల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు ఎవరో గుర్తు తెలియని దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుల పై నెల్లిమర్ల పోలీసులు మూడు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కేసుల దర్యాప్తులో భాగంగా నెల్లిమర్ల పోలీసులకు వచ్చిన సమాచారం పై ఓఎల్ఎక్స్ లో ఒక మొబైల్ ఫోను విక్రయించిన వ్యక్తి పై నిఘా పెట్టారు. సదరు వ్యక్తిని విచారించగా, తాను మరో వ్యక్తి నుండి ఫోనును కొనుగోలు చేసి, ఓఎల్ఎక్స్ లో పెట్టి విక్రయించినట్లుగా అంగీకరించడంతో విజయ నగరం  పూల్ బాగ్ కు చెందిన తుపాకుల సాయికుమార్ అనే నిందితుడ్ని అదుపులోకి తీసుకొని, విచారించారు.

నిందితుడి పై విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషనులో హిస్టరీ షీటు వుండటం, చెడు వ్యసనాలకు లోనై, ప్రభుత్వకార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని, కంప్యూటర్లు, ప్రింటర్లు, సిపియూలు, ట్యాబ్ లను దొంగిలించినట్లుగాఅంగీకరించాడు. దొంగిలించిన వస్తువులను మరో ఇద్దరు జువినల్స్ సహకారంతో ఒఎల్ ఎక్స్ లో పెట్టి, అమ్మకాలుసాగించి, వచ్చిన డబ్బులను పంచుకోవడం, విలాసాలకు వినియోగించేవారన్నారు. నిందితుడు తుపాకుల సాయి వద్ద నుండి మూడు కంప్యూటరు మోనిటర్లు, రెండు సిపియూలు, మూడు ప్రింటర్లు, ఒక ట్యాబును స్వాధీనం చేసుకొని, నిందితుడ్ని రిమాండుకు తరలించామన్నారు.

అదే విధంగా ఈ కేసుల్లో అరెస్టు కాబడిన ఇద్దరు జువినల్స్ ను జువినల్ కోర్టుకు తరలించామని డీఎస్పీ పి. అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మూడు కేసులను చేధించడంలో క్రియా శీలకంగా పాత్ర పోషించిన రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు, సిబ్బందిని అభినందించారు.

ఈ మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, రూరల్ సీఐ టిఎస్ మంగవేణి, నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు పాల్గొన్నారు.

Related posts

నేడే తెలంగాణ లో ఆర్ ఎస్ ఎస్ సంకల్ప్ శిబిరం

Satyam NEWS

ఈ ఐదేళ్లూ ఏం పీకావు జగన్ రెడ్డీ?

Satyam NEWS

దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే సిపిఐ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment