32.2 C
Hyderabad
May 8, 2024 22: 28 PM
Slider కర్నూలు

కరోనాతో మృతి చెందిన కార్మిక నాయకుల సంతాప సభ

#Condolence Meeting

ఇటీవల కరోనాతో మరణించిన ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముక్తార్ పాష, ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ చాంద్ భాష సంతాప సభ ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు ఆటో మొబైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏ బెనహర్ ఎస్ కే వలీ తెలిపారు.

కర్నూలు జిల్లా సుండి పెంట స్థానిక ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఆయన గురువారంనాడు మాట్లాడుతూ స్థానిక జూనియర్ కళాశాలలో ఈ సంతాప సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముక్తార్ పాషా సుమారు ఆరు దశాబ్దాల కాలంలో నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమ జీవితమే ఊపిరిగా భావించి కార్మికవర్గం కోసం పీడిత ప్రజల కోసం తుది శ్వాస వరకు మడమ తిప్పని నికార్సైన విప్లవ కార్మిక అవిశ్రాంతంగా శ్రమించాడు.

ఈయన సుమారు 17 రకాల ఏర్పాటు చేసి సాధారణ కార్యకర్త నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. అలాగే ఆటో మొబైల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ చాంద్ భాష కుటుంబం 19 63 లో  డ్యామ్ నిర్మాణం కోసం వచ్చి స్థిరపడి ఇ ఎలక్ట్రిషన్ కార్మికులుగా పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై పని చేశారు.

స్థానిక సున్నిపెంట గ్రామం లో ప్రభుత్వ హాస్పిటల్ మంచినీటి సమస్యలు మీద ఆటోమొబైల్ కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆటో నగర్ కు స్థలం కేటాయించాలని అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న క్రమంలో కరోనా వ్యాధి తో కర్నూల్ ప్రభుత్వ అ హాస్పిటల్ లో మరణించారు.

వీరిద్దరి సంతాప సభను జయప్రదం చేయాలని కరపత్రం రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో  ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఆశీర్వాదం ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ స్థానిక అధ్యక్షులు వై శ్రీను కార్యదర్శి మల్లికార్జున ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అధికారానికి “తీన్మార్” ఇప్పుడే మొదలైంది

Satyam NEWS

ఏడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేకపోయి ఈటెల

Satyam NEWS

మాతృ దేవత

Satyam NEWS

Leave a Comment