28.7 C
Hyderabad
May 6, 2024 02: 13 AM
Slider రంగారెడ్డి

మ్యాట్  ల్యాబ్ లో  అధ్యాపకులకు  శిక్షణ కార్యక్రమం

#cbit

సిబిఐటి కళాశాల లో గత మూడూ రోజుల గా జరుగుతున్న మ్యాట్  ల్యాబ్ లో  అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ మూడు రోజులు సిములింక్, హెచ్డిఎల్  కోడ్ జనరేషన్, మెడికల్ ఇమేజింగ్, ఆప్టిమైజేషన్, ఎలక్ట్రిక్ వెహికల్, మెషిన్ & డీప్ లెర్నింగ్ టూల్‌బాక్స్‌లు లో శిక్షణ జరిగినట్టు ఈ కార్యక్రమ నిర్వాహకుడు డా. టి. అరవింద బాబు తెలిపారు.  మొదటి రోజు సిములింక్‌తో డైనమిక్ సిస్టమ్ మోడలింగ్, రెండవ రోజు మ్యాట్  ల్యాబ్తో మెడికల్ ఇమేజింగ్ మరియు ఆప్టిమైజింగ్, మూడవ రోజు మ్యాట్  ల్యాబ్, సిములింక్‌తో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలు,  మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద శిక్షణ ఇచ్చినట్టు  డాక్టర్ పి విజయ బాబు తెలిపారు. కాప్రికాట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రొడక్ట్ మేనేజర్ జె ప్రేమ్ కుమార్ ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా వ్యహరించినట్టు అరవింద బాబు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహ అధ్యక్షత వహించి  ఈ టెక్నాలజీ తరంలో  కళాశాలల్లో నడిచే అంతర్గత శిక్షణ కార్యక్రమాలు, అధ్యాపకులు ఎంతో అవసరం అని తెలిపారు.  డా. టి. అరవింద బాబు ఈ కార్యక్రమ నిర్వహణకోసం సహకరించిన ఎమ్ సూర్య ప్రకాష్ మరియు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

మోడీ వ్యూహంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేనా?

Satyam NEWS

కమలానికి, కారు పార్టీకీ ఏకకాలంలో షాక్ ఇచ్చిన కాంగ్రెస్

Satyam NEWS

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

Satyam NEWS

Leave a Comment