38.2 C
Hyderabad
May 2, 2024 21: 35 PM
Slider మహబూబ్ నగర్

అమరచింత ఎస్ఓను సస్పెండ్ చేయాలి

#amarachinta

వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిల ఫుడ్ పాయిజన్ కి కారణమైన ఎస్.ఓ స్వప్నను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థినిలను వనపర్తి జిల్లా ఆసుపత్రిలో ఎస్ ఎఫ్ ఐ బృందం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది మాట్లాడుతూ అమరచింత మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి సుమారు 50 మంది విద్యార్థినిలు రాత్రి చేసిన భోజనం,ఈ ఉదయం అల్పాహారంలో విషతుల్యంగా మారడంతో విద్యార్థినిలకు కడుపులో మంటతో అల్లాడిపోయి ఆసుపత్రిలో చేరారాని తెలిపారు.గతంలో అనేకసార్లు సమస్యల పట్ల ఎస్.ఓ దృష్టికి తీసుకెళ్లిన ఏం పట్టనట్లు వ్యవహరించడంతో పాటు విధులపట్ల, విద్యార్థినిల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించేదన్నారు. విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఫుడ్ పాయిజన్ కు కారణమైన ఎస్.ఓ స్వప్న పై,సిబ్బందిపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని,పర్యవేక్షణ పెంచాలని,విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. వినతి పత్రం అందించిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు యుగంధర్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు గణేష్ ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మోదీ జనాకర్షణ పైనే గుజరాత్​ బీజేపీ ఆశలు

Bhavani

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

Sub Editor 2

గ్రేడింగ్ చేయడం ద్వారా నిమ్మ ఉత్పత్తులకు మేలైన మార్కెటింగ్

Satyam NEWS

Leave a Comment