Slider ముఖ్యంశాలు

నామ సంస్థ ఆస్తుల జప్తు

#nama

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు  చెందిన మధుకన్ సంస్థ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీకి చెందిన సంస్త ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన 80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో 73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న 361.29 కోట్లను దారి మళ్ళించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది. కాగా రాజకీయంగా మోడి , కే‌సి‌ఆర్ ల మధ్య యుద్దం జరుగుగున్న నేపధ్యంలో టి‌ఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేతగా వున్న నామ కు చెందిన కంపెనీ ఆస్తుల జప్తు పలు అనుమానాలకు తావిస్తోంది.

Related posts

స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న భర్త

Satyam NEWS

కరోనా విపత్తు నిర్మూలన కోసం 30 న సహస్ర గాయత్రి జపం

Satyam NEWS

శ్రీ సాయి హోమియో క్లినిక్ ను ప్రారంభించిన చదలవాడ

Satyam NEWS

Leave a Comment