38.2 C
Hyderabad
April 29, 2024 13: 57 PM
Slider ఆధ్యాత్మికం

కరోనా విపత్తు నిర్మూలన కోసం 30 న సహస్ర గాయత్రి జపం

#gayatrimantram

ప్రస్తుత కరోనా కోరల్లో చిక్కుకున్న మానవాళి క్షేమం గా బయట పడి ప్రాణికోటి పూర్వవైభవాన్ని పొందాలనే సంకల్పం తో కరీంనగర్ జిల్లా గాయత్రి ఉపాసన సంస్థ ఆదివారం నాడు సహస్ర గాయత్రి జపం నిర్వహించాలని సంకల్పించింది.

30 వ తేదీ ఉదయం బ్రాహ్మణులు ఎవరి ఇంటి వద్ద వారు “సహస్ర (1008)గాయత్రి జపం” చేయాలని తెలంగాణ గాయత్రి ఉపాసన సంస్థ అధ్యక్షుడు వినోద్ కుమార్ మహావాది పిలుపునిచ్చారు.

ఉపనయనం అయిన బ్రాహ్మణులు అందరూ ఈ జపంలో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు.

గాయత్రి ని మించిన మంత్రం లేదు, తల్లి ని మించిన దైవం లేదనే నానుడిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గయలు అంటే ప్రాణాలు, గయాన్ త్రాయతే ఇతి గాయత్రి, గానము (జపం )చేయు వాని ప్రాణము రక్షించునది గాయత్రి, గాయత్రి ఉపాసన ప్రాణోపాసనయే. మన అందరి సమిష్టి ఉపాసన ద్వారా గాయత్రి మాత మానవాళికి మంచి రోజులు ప్రసాదిస్తుంది అని ఆయన వివరించారు.

అఖిల బ్రాహ్మణ సేవాసంఘం, ABBM కరీంనగర్, బ్రాహ్మణ సంఘము హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, చొప్పదండి, రామడుగు, మానకొండూర్ లు సమిష్టి గా ఈ కార్యక్రమం నిర్వహిస్తాయని ఆయన తెలిపారు.

కార్యక్రమం నిర్వహించిన తర్వాత 9000013755 కు వాట్స్ యాప్ చేయాలని ఆయన కోరారు.

అదే విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేసి బంధుమిత్రులను ట్యాగ్ చేయడం ద్వారా ఇతరులకు కూడా సమాచారాన్ని అందించవచ్చునని ఆయన తెలిపారు.  

Related posts

గణనాథుని ఆశీస్సులు ప్రజలందరు పై ఉండాలి

Satyam NEWS

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

Satyam NEWS

కేపిహెచ్ బి లో ప్యుర్ ఓ నాచురల్ ప్రారంభించిన వసుంధర

Satyam NEWS

Leave a Comment