32.7 C
Hyderabad
April 27, 2024 01: 50 AM
Slider జాతీయం

స్నేహితులతో గడపాలని భార్యను వేధిస్తున్న భర్త

#sexualharassment

పేద తరగతి మహిళలు, చదువు లేని వారు, గ్రామీణ ప్రాంతాల వారు లైంగిక నేరాలకు గురి అవుతారని అనుకుంటూ ఉంటాం. బాగా చదువుకున్న మహిళలు, అర్ధికంగా స్థిరపడిన మహిళలకు కూడా లైంగిక వేధింపులు గురి అవుతున్నారని చెప్పే సంఘటన ఇది. బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మహిళ ఎవరూ ఊహించని లైంగిక వేధింపునకు గురైంది. భర్త కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరే.

తనిసంద్ర మెయిన్‌రోడ్డులోని సంపిగేహళ్లికి చెందిన 34 ఏళ్ల ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహిళ వచ్చిన కష్టం మరే ఇతర మహిళకు ఈ కష్టం రాకూడదు అనిపిస్తుంది. ఆమె భర్త ఆమెను తన స్నేహితులతో కలిసి పడుకోమని బలవంతం చేస్తున్నాడు. వారితో సెక్స్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. సాంకేతిక నిపుణుడు కూడా అయిన 36 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకోవడానికి నిరాకరించినందుకు తన భర్త తనను కొట్టేవాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆ మహిళను తన ఇద్దరు స్నేహితులతో కలిసి పడుకోమని బలవంతం చేసి తన మొబైల్‌లో రికార్డు చేశాడు కూడా. ఆ మహిళ విడాకులు కోరగా, ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. 2011 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

సంపిగేహళ్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం నిందితుడు భర్త మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని మహిళ సోదరిని బలవంతం చేశాడు. తన భర్త మద్యం మత్తులో తనను కొట్టేవాడని కూడా మహిళ ఆరోపించింది. ఇంట్లో వాతావరణం చెడిపోవడంతో, తాను తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అతను దానికి నిరాకరిస్తూ తనను హింసిస్తున్నాడని ఆమె చెప్పింది.

తన భర్త గంజాయికి అలవాటు పడ్డాడని మహిళ ఆరోపించింది. ఇందుకోసం తన ఇంటిలోని కుండీలో రెండు మొక్కలు పెంచాడని ఆమె తెలిపింది. ఆ మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

కరోనాపై పోరాటానికి కొమ్మూరి విరాళం రూ. లక్ష

Satyam NEWS

ఇంటింటికీ జాతీయ జెండా కార్య‌క్ర‌మం ప్రారంభం…!

Satyam NEWS

New Game Started: తెరాస లోకి పెద్దిరెడ్డి: బీజేపీ లోకి ఈటెల

Satyam NEWS

Leave a Comment