27.7 C
Hyderabad
May 4, 2024 09: 08 AM
Slider క్రీడలు

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ కు అభినందన

#NagamGnanadivya

గత నెల నవంబర్ 28న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నందు జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో గుంటూరు నగరానికి చెందిన నాగం జ్ఞానదివ్య పాల్గొని 84+ కేజీ ల కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించింది. నేడు నాగం జ్ఞానదివ్య గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ను సంపత్ నగర్ లోని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

గోల్డ్ మెడల్ సాధించినందుకు విద్యార్థినిని అభినందించి, భవిష్యత్తులో ఇంకా ఎన్నో పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించి గుంటూరు నగరానికి పేరుప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో YSRCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, విద్యార్థిని తండ్రి నాగం వెంకటేశ్వరరావు, కోచ్ నాగ శిరీష,సీనియర్ కోచ్ మహమ్మద్ కమృద్దీన్,YSRCP నేత తోట ఆంజనేయులు, బాలరాజు పాల్గొన్నారు.

Related posts

ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

Bhavani

పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రైతు భూమిలో ప్రత్యర్థుల  రోడ్డు నిర్మాణం

Satyam NEWS

పట్టాలున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment