28.7 C
Hyderabad
May 5, 2024 10: 35 AM
Slider కడప

పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రైతు భూమిలో ప్రత్యర్థుల  రోడ్డు నిర్మాణం

#farmar

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చెర్లోపల్లి లో పంట రైతు స్వంత పొలాల్లో దౌర్జన్యం గా ప్రత్యర్థులు రహదారి నిర్మాణం పై రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాజంపేట డీఎస్పీ వి.యన్.కె.చైతన్య కు బుధవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. చెర్లోపల్లి లో బాధిత రైతు బసిన బోయిన సుబ్బయ్య (50) యానదమ్మ దంపతులు చెర్లోపల్లి లో దాదాపు 25 సంవత్సరాల నుంచి 357,58,59 లో 5 ఎకరాల పట్టాభూమి సాగు చేస్తున్నారు.

అయితే వీరి భూమి వెనుక వైపు రహదారి కోసం బసిన బోయిన వెంకటయ్య ఒత్తిడి చేయడంతో వివాదాం చెలరేగింది. బాధిత రైతు బసిన బోయిన సుబ్బయ్య కుటుంబాన్నీ రూరల్ పోలీసులు మంగళవారం 17 వతేది పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూర్చో బెట్టి సాయంత్రం వదిలి పెట్టినట్టు బాధితులు తెలిపారు. ఈలోపు తమ ప్రత్యర్ధులు తమ స్థలంలో అక్రమంగా రోడ్డు వేశారని, దీనికి కారణం పోలీసులు,రెవెన్యూ,విద్యుత్ శాఖా అధికారులని వారు ఆరోపించారు. తమ పై వీఆర్వో ను తాము దూషించినట్టు తప్పుడు సమాచారం ఇచ్చి నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ వారు గతంలో తమ పేరిట పొలంలో ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పటు చేసి సరఫరా ఇవ్వగా ఇప్పుడు రాజకీయ ఒత్తిడితో విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా లెక్క చేయ కుండా అధికారుల అండ దండలతో అక్రమాలకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలని,లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చెడుకుంటామని హెచ్చరించారు. కాగా డిఎస్పీ వి.యన్.కె.చైతన్య సంబంధిత పోలీస్,రెవెన్యూ అధికారులతో ఫోన్ లో మాట్లాడి సంఘటనా స్థలం కు వెళ్లి,సి.సి,కెమెరాలను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. విచారించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు..

Related posts

800 కోట్లకు ప్రపంచ జనాభా

Murali Krishna

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కరించాలి

Satyam NEWS

సర్వే:సౌండ్ పొల్యూషన్ దేశం లో హైదరాబాదే టాప్

Satyam NEWS

Leave a Comment