28.7 C
Hyderabad
April 28, 2024 04: 14 AM
Slider హైదరాబాద్

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

#AryaVaishyaMahasabha

భారతదేశంలోని వైశ్యులందరికీ సేవ చేయడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు యేల్చూరి వేణుగోపాలరావు చెప్పారు. శుక్రవారం తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య, నిత్యాన్నదాన సత్రాలకు సంబంధించిన పరిపాలనా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతులమీదుగా ప్రారంభించారు.

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం నుండి ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు యేల్చూరి వేణుగోపాలరావు మాట్లాడుతూ దేశంలోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో కొలువుతీరిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు షిరిడీ, హరిద్వార్, తిరుపతి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాల్లో శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిద్వారా వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారికి ఉచితంగా అల్పాహారం, భోజన సదుపాయాలను కల్పించడం జరుగుతోందన్నారు.

అలాగే దేశ నలుమూలల నుండి వచ్చే ఆర్యవైశ్య ప్రముఖులందరికీ నామమాత్రపు రుసుంతో వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. వీటితో పాటు విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్ షిప్ లను కూడా అందజేస్తున్నామన్నారు. చదువుకు అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లించే పద్దతిన వడ్డీ లేకుండా ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వంటి ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ఆర్యవైశ్య విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఐదారుగురు అభ్యర్థులు ఐఆర్ఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలను సాధించగలిగారన్నారు. ప్రస్తుతం శ్రీకాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం, నిత్యాన్నదాన సత్రాలను విస్తరించే పనిలో ఉన్నామన్నారు.

కొత్తగా శ్రీశైలం, అరుణాచలం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ నిత్యాన్నదాన సత్రాల పర్యవేక్షణకు పరిపాలనా కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు టీజీ వెంకటేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, కన్వీనర్ గుబ్బా చంద్రశేఖర్, విలాస్ రావు, ఏపీ ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు విచ్చేశారని తెలిపారు. గుడివాడ పట్టణం నుండి వైశ్య ప్రముఖులు తిరువీధి శ్యామ్, కొణిజేటి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారని చెప్పారు.

దేశవ్యాప్తంగా వైశ్య సామాజిక వర్గానికి అవసరమైన సేవలందించడమే లక్ష్యంగా ఈ మహాయజ్ఞం కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పరిధిలోనూ వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి తనవంతు కృషి చేస్తున్నానని యేల్చూరి వేణుగోపాలరావు తెలిపారు.

Related posts

ప్రగతి భవన్ కుక్క ఆకస్మిక మరణం

Satyam NEWS

విశాఖ మన్యంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి

Satyam NEWS

పాపం 40 మంది పిల్లలు:వికటించిన మధ్యాహ్న భోజనం

Satyam NEWS

Leave a Comment