37.7 C
Hyderabad
May 4, 2024 12: 28 PM
Slider నిజామాబాద్

కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

#congress

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని యూత్ కాంగ్రెస్ కామారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు ఐరెని సందీప్ అన్నారు. నేడు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో సందీప్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణ అలవారు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సురభి ద్వివేది గార్లతో జరిగిన సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందని సందీప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతీ కార్యకర్త తమ తమ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోయే పథకాలను గ్రామ గ్రామాన ఇంటింటికి తెలియజేయాలని పిలుపునిచ్చారని, త్వరలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

సుమన్‌ చేతుల మీదుగా ‘రంగస్వామి’ ట్రైలర్

Bhavani

విఆర్ఎ లకు ప్రభుత్వం న్యాయం చేయాలి: సిఐటియు

Satyam NEWS

తెలంగాణ తొలి అమరుడికి ఘన నివాళులు

Bhavani

Leave a Comment