28.7 C
Hyderabad
April 28, 2024 09: 20 AM
Slider ముఖ్యంశాలు

విఆర్ఎ లకు ప్రభుత్వం న్యాయం చేయాలి: సిఐటియు

#sheetalroshapati

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రెవెన్యూ శాఖకు కనీసం మంత్రి కూడా లేడని, ముఖ్యమంత్రి శాసనసభలో వి ఆర్ ఎ లకి ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 9, 2020 పే స్కేల్ జి ఓ ని తక్షణమే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన విఆర్ఏ ల ధర్నాలో పాల్గొని రోషపతీ మాట్లాడుతూ విఆర్ఏ లు గౌరవంగా బ్రతకటానికి పే స్కేల్ ఇస్తామని,50 సంవత్సరాలు దాటిన వారి వారసులుకి ఉద్యోగాలు ఇస్తామని శాసనసభలో ప్రకటించి 18 నెలలు దాటినా అమలు చేయలేదని విమర్శించారు.కనీసం పి ఆర్ సి లో చేర్చుతామని చెప్పి ప్రభుత్వం అది కూడా చేయకుండా మోసం చేసిందని అన్నారు.అర్హత కలిగిన వారికి గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని,కరోనాతో మరణించిన విఆర్ఏలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.

వి ఆర్ ఎ  రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీమల్ల నరసింహారావు మాట్లాడుతూ విఆర్ఏ ల సమస్యలు పరిష్కరించాలని ఈనెల10న,కలెక్టర్ కార్యాలయం వద్ద ఈనెల 22న,తేదీన చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకి పెద్ద ఎత్తున తరలిరావాలని వి ఆర్ ఎ ఐక్య కార్యాచరణ ఇచ్చిన పిలుపుని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వి ఆర్ ఏ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్,నియోజకవర్గ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్,నాయకులు చిన్న వీరయ్య,ఎం డి కాసిం,వీరబాబు, నాగమ్మ,సంధ్య,సుశీల్,రంజాన్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

తిరుపతి వందేభారత్‌లో 1,128 సీట్లు

Bhavani

కరోనాను కడతేర్చు మా తల్లి

Satyam NEWS

అనారోగ్య బాధితుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment