Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం

#congress

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో టిఆర్ఎస్ పార్టీ  పేదల భూములు కొల్లగొట్టడానికి ధరణి పోర్టల్ తెచ్చారని, వి ఆర్ ఏ ,వ్యవస్థను సమూలంగా నాశనం చేశారని దుయ్యబట్టారు.తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1954  -55 లో భూమికి సంబందించిన అతి ముఖ్యమైన కాస్త్రా పహాణీలు రాశారన్నారు.

ఇలా రాయడం వల్ల కొన్ని లక్షల ఎకరాలను  కాంగ్రెస్ సర్కార్ ఆరోజు భూమి పైన వున్న సాగు చేసుకుంటున్న వారి పేర్ల పైనే పట్టా  చేశారని తెలిపారు. వారే భూయజమానిగా ఉండేవారన్నారు.ఇప్పటికి ఇదే రికార్డ్ ప్రామాణికంగా వుందని,కాగా తెరాస పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు 70 సంవత్సరాల తరువాత ధరిణి పోర్టల్ తెచ్చి భూమికి సంబందించిన అనేక అంశాలను చిక్కులో పడేసి రాష్ట్ర ప్రభుతం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . పేదల భూమిని అప్పనంగా లాక్కోవడానికే ధరణి పోర్టర్ తెచ్చిందని ఆయన దుయ్యబట్టారు. వీఆర్వో ఓ వవ్యస్థ ని నాశనం చేసి తహసిల్దార్ అదికారాలను కత్తరించి అధికారాలను కలెక్టర్లకు ఇచ్చారన్నారు. క్షేత్రస్థాయిలో ధరణికి సంబంధించి ప్రజలకు వివరిస్తారని వి ఆర్ ఏ ,వి ఆర్ ఓ లను రెవెన్యూ శాఖ నుంచి తప్పించారని అయన ఆరోపించారు.

ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కరించాలి అంటే గ్రామా గ్రామాన రెవిన్యూ సదస్సులు నిర్వహించి ఆ సదస్సులో వచ్చిన సమస్యలను అక్కడిక్కడే పరిష్కారం చేయాలని కావలిసిన అన్ని అదికారాలను మండల రెవెన్యూ ఆఫీసర్లకు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విధంగానైనా చేస్తే రైతుల భూమి తగాదాల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర  ప్రభుత్వానికి మల్లి కాస్త్రా పహాణీలు రాసె దమ్ముందా? భూ సర్వే చేసే దమ్ముందా ? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులకు రైతుల పార్టీ రైతు బాగోగులు చూసే పార్టీ అని గొప్పలు చెప్పుకునే రైతుల శ్రేయస్సు కోరే పార్టీ అయితే భూ సమస్యలపై రైతు అనుభవిస్తున్న కష్టాలపై తక్షణమే న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Satyam NEWS

వేపాడ జేడ్పీ ఉన్న‌త‌పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించిన విజయనగరం క‌లెక్ట‌ర్

Satyam NEWS

బాసరలో ఘనంగా పౌర్ణమి పూజలు

Satyam NEWS

Leave a Comment