32.2 C
Hyderabad
May 12, 2024 21: 58 PM
Slider విజయనగరం

వేపాడ జేడ్పీ ఉన్న‌త‌పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా సంద‌ర్శించిన విజయనగరం క‌లెక్ట‌ర్

#vijayanagaramcollector

అన్నం పెట్టాల‌న్నా..దాన్నిపిల్ల‌ల‌కు తినిపించాల‌న్నా…మొద‌ట అమ్మ‌ అదేనండి త‌ల్లి పేరునే ఎవ్వ‌రైనా  ప్ర‌స్తావిస్తారు…కాదు..కాదు ప్రస్తావించాలి. ఎందుకంటే పిల్ల‌లు మారం చేసిన స‌మ‌యంలో భూదేవికి ఉన్నంత స‌హ‌నం,ఓపికి త‌ల్లి కి ఉంటుందంటారు.అయితే ఈ సోది ఎందుకు చెబుతున్నాన‌ని అనుకుంటున్నారా..?  ఎందుకంటే.. విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్టర్,అందునా ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్… ఇంకా చూస్తే…ఓ స్త్రీ.అంతే  త‌న ఆకస్మిక త‌నిఖీల‌లో వేపాడ జిల్లా పరిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు.

అక్క‌డ పిల్ల‌ల‌కు పెడుతున్న మ‌ధ్యాహ్న భోజనం తీరు తెన్నుల‌ను ద‌గ్గ‌రుండీ ప‌రిశీలించారు. అప్పుడే పాఠ‌శాల‌కు తీసుకొచ్చిన  వండిన భోజ‌నాన్ని క‌లెక్ట‌ర్ కాస్త నిశితంగా ప‌రిశీలించారు. ఆయాలు తెచ్చిన ప‌దార్ధాన్ని స్వ‌యంగా నోటిలో వేసుకుని దారి రుచి చూసారు..జిల్లా  క‌లెక్ట‌ర్. రోజూ ఇలానే వండుతున్నారా..?  లేక పోతే నేను వ‌చ్చాన‌ని ఇలా వండారా అని అయాల‌ను ప్ర‌శ్నించారు.

అంతా  ఫ్లోరిపైడ్ బియ్యంతో వండుతున్నారు క‌దా..అంటూ పాఠ‌శాల హెచ్ ఎంను కలెక్ట‌ర్ ప్ర‌శ్నించారు.ఈ సంద‌ర్బంగా  పదో తరగతి విద్యార్ధులతో మాట్లాడి వారు పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం అవుతున్నదీ తెలుసుకున్నారు… జిల్లా కలెక్టర్.విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధం కావాలని, ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో పది పాయింట్స్ సాధించాలని తెలిపిన జిల్లా కలెక్టర్  సూర్యకుమారి ఆకాంక్షించారు. ఇక‌ జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు… మండల ప్రత్యేక అధికారులు.ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, సరఫరా చేస్తున్న గుడ్ల నాణ్యత, పదో తరగతి పరీక్షల సన్నద్ధత గురించి ఆరా తీసారు.. ప్రత్యేక అధికారులు.

Related posts

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీ

Satyam NEWS

శ్రీ శోభకృత్ నామ సంవత్సర నూతన పంచ్ఞాగ ఆవిష్కరణ

Satyam NEWS

టెర్రిబుల్: బాలుడికి టీచర్ నుంచి లైంగిక వేధింపులు

Satyam NEWS

Leave a Comment