32.7 C
Hyderabad
April 27, 2024 02: 59 AM
Slider పశ్చిమగోదావరి

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

#eluru mayor

షేక్ నూర్జహాన్ పెదబాబు రెండోసారి ఏలూరు నగర మేయర్ పీఠాన్ని అధిష్టించి, 150 ఏళ్ళ నగరపాలక సంస్థ చరిత్రను తిరగ  రాశారని  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ SC నాయకులు పొలిమేర హరికృష్ణ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని స్థానిక  మేయర్ క్యాంపు కార్యాలయంలో మేయర్ దంపతులను హరికృష్ణ, పెరికే వరప్రసాద్, బడుగు రామ కృష్ణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి గా  15 నెలల క్రితం ప్రకటించారని తెలిపారు.

అప్పటి నుంచే ప్రజలు షేక్ నూర్జహాన్ ను మేయర్ గా ఫిక్సయి పోయారని ఆయన తెలిపారు. ఇప్పుడు జరిగిన ఎన్నిక లాంఛనమైందేనని హరికృష్ణ తెలిపారు. రెండోసారి గెలిచి, ఆమె చరిత్ర సృష్టి సృష్టిస్తారని ఆనాడే తాను అన్నట్లు హరికృష్ణ గుర్తు చేశారు.

ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ పరిధిలో ఉన్న 7 పంచాయతీలు ఏలూరు లో విలీనం చేయడం ద్వారా భౌగోళికంగా అతి పెద్ద నగరంగా ఏర్పడిందన్నారు. ఏలూరు పెద్ద నగరంగా ఏర్పడడం  ఆనందదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘంటాడి రమేష్, గూడవల్లి శ్రీనివాస్, మందపాటి జోజి, M సత్యం,N ఎల్లయ్య,  స్వామి, రాజేష్, పూర్ణ, కాటయ్య వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

కరోనా కేసులు పెరుగుతున్నందున తగిన వసతులు కల్పించాలి

Satyam NEWS

డ్రైనేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Satyam NEWS

ఆర్యవైశ్య మహిళ హత్య కేసులో అనుమానితులు

Bhavani

Leave a Comment