28.7 C
Hyderabad
May 5, 2024 07: 59 AM
Slider ప్రత్యేకం

మోసాల కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే

#kcr

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలలో మోసాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలలో కూడా గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజ్ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం మధిర లో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పదిమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని కానీ జరిగే ఎన్నికలలో ఎన్నికలలో మోసాల కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో కూడా గెలిచే అవకాశం లేదన్నారు.

58 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాక్షస కోణం ఉంటే తొమ్మిదిన్నర సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో మానవీయ కోణం ఉందన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తెస్తామంటున్న భూమాత కాదని భూమెత అని విమర్శించారు. రైతుబంధు వృధా అని వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. నాడు మధిర శాసనసభ్యునిగా ఉన్న బోడపూడి వెంకటేశ్వరరావు ఎండిన వరి కంకులతో శాసనసభకు వచ్చే వారన్నారు. దుమ్ముగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టుతో 37 టీఎంసీల గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు వస్తాయని దీంతో మధిర నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో చిల్లకల్లు నుండి మధిరకు విద్యుత్ సరఫరా జరగడంతో నిరంతరం విద్యుత్ కోతలు ఉండేవని దీనిని గుర్తించి స్వయంగా తానే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఖమ్మం నుండి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్లు వేయించాను అన్నారు. 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని కానీ మోసాల కాంగ్రెస్ ఆ వాగ్దానాన్ని మరిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదాలు వేస్తే వేస్తుండటంతో కెసిఆర్ శవయాత్ర లేక తెలంగాణ జైత్రయాత్ర అని తాను ఉద్యమించడంతో దేశంలోని 33 రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో తెలంగాణ ఏర్పడిందన్నారు.

రెండుసార్లు మధిర నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించినప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న తాను ఎటువంటి వివక్షకు తావు లేకుండా మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మధిర అభివృద్ధికి చుట్టపు చూపుగా వచ్చే కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కని ఓడించి నిరంతరం ప్రజల మధ్యనే ఉండే లింగాల కమల్ రాజుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మధిరకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెలిపాడ్ వద్ద ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

సభలో బి ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, మధిర అభ్యర్థి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ తాత మధు, డి సి జి బి చైర్మన్ వైస్ చైర్మన్ కూరాకుల నాగభూషణం, దొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కథలాపూర్ లో రాళ్ల వానతో తడిసిన ధాన్యం

Satyam NEWS

విజయవంతంగా ధరణి పోర్టల్ నిర్వహణ

Satyam NEWS

కరోనాను జయించిన పేషంట్స్ కు వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment