26.7 C
Hyderabad
May 3, 2024 08: 27 AM
Slider మహబూబ్ నగర్

విజయవంతంగా ధరణి పోర్టల్ నిర్వహణ

#RepublicDayNagarkurnool

రాజ్యంగా నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్  స్పూర్తితో ప్రజలకు, మెరుగైన,  నాణ్యమైన సేవలు అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అన్నారు.  మంగళవారం 72వ  భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో జిల్లా యస్పి డా. వై. సాయిశేఖర్ తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆస్తుల బదలాయింపు విషంలో సరళీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ జిల్లాలో సమర్థవంతంగా నిర్వహిస్తూ  ఇప్పటివరకు 4753 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

రైతు బంధు, ధాన్యం కొనుగోలు మరింత వెసులుబాటు

రైతు బంధు కింద జిల్లలో 257209 మంది రైతులకు  717 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. వాన కాలంలో జిల్లాలో 200 వారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 8.70 లక్షల క్వింటాళ్ళ వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

2020-21 ఉద్యాన అభివృద్ధి  పతాకము కింద 266 హెక్టార్ల విస్తీర్ణంలో 26.90 లక్షల రూపాయల ఆర్ధిక వ్యయంతో 170 మాంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చినట్లు వెల్లడించారు.  35 శాతం రాయితీపై శీతల గిఫ్డంగుల ఏర్పాటుకు 1.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఆయిల్ పామ్ సాకుకు సబ్సిడీలు

జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతులకు సబ్సిడీ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలో వ్యవసాయ సాగు నీటికి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటివరకు 3.76 టి.యం. సి. ల నీటిని ఎత్తిపోయడం జరిగిందన్నారు.  

మిగిలిన 10 శాతం పనులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయుటకు నిశ్చయించినట్లు తెలిపారు.   మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కై జిల్లాలో ఈ సంవత్సరం 721 చెరువులో 241 లక్షల చేప పిల్లలను వదిలినట్లు వెల్లధించారు. 

వంద శాతం సబ్సిడీపై 2 రిజర్వాయర్ లలో 3.43 లక్షల రొయ్యలు వదిలామని చెప్పారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 3043 మందికి కోవిడ్ టీకా ఇచ్చామని అన్నారు. స్వయం ఉపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న అన్ని పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సిసి కెమెరాలతో సమర్ధంగా పోలీసింగ్

జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీస్ శాఖ ద్వారా పి.టి.జడ్ , సిసి కెమెరాలు అమర్చడం, ఫేస్ బుక్, సోషల్ మీడియాను ఉపయోగించి నేరాలను కట్టడి చేయడం, నేరస్తులను వెంటనే పట్టుకుంటున్నామని తెలిపారు. అనంతరం జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు అయిన యం. వెంకట్రావు, యం. డి. హుస్సేన్, లలిత బాయి లను ప్రజాప్రతినిధుల తో కలిసి సన్మానించారు.

అంతకుముందు పతాకావిష్కరణ అనంతరం జిల్లా ఎస్పీ తో కలిసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆర్మ్ డ్ పోలీస్ ద్వారా కవాతు నిర్వహించి జిల్లా కలెక్టరుకు గౌరవ వందనం చేశారు.

ఈ కార్యక్రమానికి జడ్పి చైర్మన్ పి. పద్మావతి, కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ హన్మంత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ చిత్రా మిశ్రా, డి.ఆర్.ఓ మధుసూదన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీస్ అధికారులు  ప్రజలు పాల్గొన్నారు.

Related posts

నేరరహిత సమాజంగా మార్చడానికి సీసీ కెమేరాలు దోహదం

Satyam NEWS

గ్రామాలలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి

Satyam NEWS

Tirade continues : గవర్నర్లకు రఘురామ లేఖాస్త్రం

Satyam NEWS

Leave a Comment